breaking news
DIG MallaReddy
-
'మావోయిస్టుల ప్రాబల్యాన్ని అరికడతాం'
సుల్తానాబాద్: మావోయిస్టుల ప్రాబల్యం పూర్థిస్థాయిలో అరికడతామని డీఐజీ డి. మల్లారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం రాత్రి పోలీస్‌స్టేషన్, సీఐ కార్యాలయం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈసందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు పై విధంగా స్పందించారు. మావోయిస్టుల్లో విద్యావంతులు కొందరు ఉన్నంత మాత్రాన అందరు విద్యావంతులు కాలేరని, మావోయిస్టుల ప్రాబల్యం తగ్గిందని, పెరగలేదని చెప్పారు. పోలీస్ కానిస్టేబుల్ పదోన్నతులు త్వరలో కరీంనగర్లో చేపడతామని వరంగల్‌లో 130 మందికి మంగళవారం వరకు పదోన్నతులు పూర్తి చేశామని వివరించారు. కానిస్టేబుల్స్ కొరత ఉందని ప్రశ్నించగా వచ్చే 3 ఏళ్లలో అన్ని భర్తీలు చేస్తామని చెప్పారు. ఏఆర్ నుండి ఏపీఎస్పీ, సివిల్‌లో మారడం వల్ల పదోన్నతుల సమస్య, కోర్టు సమస్యలు ఉండడంవల్లే పీసీలకు పదోన్నతులు ఆలస్యం అయినాయన్నారు. ఆయుధంతో తిరిగితే, హింసాయుతమార్గం యోగ్యం కాదన్నారు. కరీంనగర్ జిల్లా ప్రశాంతంగా ఉందన్నారు. సుల్తానాబాద్, రామగుండం, గోదావరిఖని, పోలీస్స్టేషన్లను పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ జోయల్‌డేవిస్, డీఎస్పీ మల్లారెడ్డి, సీఐతులా శ్రీనివాస్‌రావు, ఎసై్స ఇంద్రసేనారెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి పాటుపడతాం
* డీఐజీ మల్లారెడ్డి * మేడారంలో ‘మీ కోసం చేయూత’ కార్యక్రమం * గొత్తికోయలకు రగ్గుల పంపిణీ * యువతకు వాలీబాల్ కిట్లు అందజేత మేడారం(తాడ్వాయి) : ఏజెన్సీలోని గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటుపడతామని డీఐజీ మల్లారెడ్డి అన్నారు. ములుగు పోలీసుల ఆధ్వర్యంలో మేడారంలో ములుగు డీఎస్పీ రాజమహేంద్రనాయక్ అధ్యక్షతన నిర్వహించిన చేయూత కార్యక్రమానికి డీఐజీ మల్లారెడ్డి, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ రాష్ర్టంతోపాటు దేశం నలుమూలల ప్రఖ్యాతిగాంచిన మేడారంలో చేయూత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ సాయంతోపాటు స్థానిక ప్రజల అవసరాలను గుర్తించి సహాయసహకారాలు అందిస్తామన్నారు. పోలీసులపై నమ్మకం కలగాలని, ప్రజలకు దగ్గర కావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు డీఐజీ తెలిపారు. జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా మండలంలో జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ములుగు, ఏటూరునాగారం సీఐలు శ్రీధ ర్, కిషోర్‌కుమార్, నర్సింహులు, ఎస్సైలు వెంకటప్రసాద్, సాంబ మూర్తి, శ్రీకాంత్‌రెడ్డి, రవీందర్, రామకృష్ణ, శ్రీనివాస్ ఉన్నారు. అజ్ఞాత నక్సల్స్ కుటుంబాలకు అర్థిక సాయం కార్యక్రమంలో భాగంగా కాల్వపల్లికి చెందిన కేకేడబ్ల్యూ కార్యదర్శి దామోదరన్న, నార్లాపూర్‌కు చెందిన ఏరువ శివారెడ్డి, గంగారం గ్రామానికి చెందిన కుమ్మరికుంట సారయ్య, మొద్దులగూడేనికి చెందిన గోపన్న, బుట్టాయిగూడేనికి చెందిన కాడరి సడవి కుటుంబ సభ్యులకు పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం వారి ని సన్మానించారు. ఈ సందర్భంగా కాడరి సత్యం తన కుమారుడు సడవిని గుర్తు చేసుకుని కంటతడిపెట్టారు. 16 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన కొడుకును ఇప్పటి వరకు చూడలేదన్నారు. కొడుకు లొంగిపోయి తమను ఆదుకోవాలని రోదించాడు. యువతకు వాలీబాల్ కిట్లు అందజేత మండలంలోని తాడ్వాయి, కాటాపూర్, లింగాల, బందాల, వీరపూర్, బయ్యక్కపేట, మేడారం, కాల్వపల్లి, నార్లాపూర్ గ్రామాల్లోని యువతకు డీఐజీ మల్లారెడ్డి, రూరల్‌ఎస్పీ అంబర్ కిషోర్‌ఝా వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏజెన్సీలో నివాసముంటున్న గొత్తికోయలకు రగ్గులు పంపిణీ చేశారు. వనదేవతలకు డీఐజీ, రూరల్ ఎస్పీ పూజలు చేయుత కార్యక్రమానికి ముందు డీఐజీ, రూరల్ ఎస్పీ సమ్మ క్క-సారలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. పగిడిద్దరాజు, గోవిందరాజులకు పూజలు చేశారు. దర్శ నానికి వచ్చిన డీఐజీ, రూరల్ ఎస్పీ, డీఎస్పీని గిరిజన పూజా రులు సంప్రదాయబద్ధంగా డోలివాయిద్యాలతో గద్దెలపై ఘన స్వాగతం పలికారు. పూజరుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు వారిని శాలువాలతో సన్మానించారు. పూజల్లో సర్పం చ్ సంధ్యారాణి, పూజారులు కాక సారయ్య, ముణేందర్, లక్ష్మణ్‌రావు, జాతర మాజీ చైర్మన్ రామ్మూర్తి పాల్గొన్నారు.