ప్రకాశం జిల్లాలో కిడ్నాప్‌ కలకలం | unknown person kidnap to the little girl in prakasam | Sakshi
Sakshi News home page

ప్రకాశం జిల్లాలో కిడ్నాప్‌ కలకలం

Jul 20 2017 4:48 PM | Updated on Sep 5 2017 4:29 PM

పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనంపై ఎత్తు కెళ్లాడు.

పెద్దచెర్లపల్లి: జిల్లాలో కిడ్నాప్‌ కలకలం రేగింది. పాఠశాలకు వెళ్తున్న ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు ద్విచక్ర వాహనంపై ఎత్తు కెళ్లన సంఘటన పెద్దచెర్లపల్లి మండలం పెద్ద ఈర్లపాడు గ్రామంలో గురువారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బ్రహ్మయ్య, పుష్ప దంపతుల కుమార్తె(5)ను గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై ఎక్కించుకొని పరారయ్యాడు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement