గుడి వద్ద బాంబులు పేలి ఇద్దరికి తీవ్రగాయాలు | Two injured in bomb blast at Temple | Sakshi
Sakshi News home page

గుడి వద్ద బాంబులు పేలి ఇద్దరికి తీవ్రగాయాలు

Jan 17 2016 10:56 AM | Updated on Aug 25 2018 5:39 PM

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బచ్చువారిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద ఆదివారం ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి.

చీరాల (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం బచ్చువారిపాలెం గ్రామంలోని పోలేరమ్మ గుడి వద్ద ఆదివారం ఉదయం రెండు నాటు బాంబులు పేలాయి. ఈ సంఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చీరాల ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆదివారం ఉదయం గుడి పక్కన ఒక బాంబు పేలింది. ఆ శబ్దానికి చుట్టుపక్కల ఉన్నవారు భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. కాసేపటికి శబ్దం ఆగిపోయింది.

ఆ సమయంలో పాపబోయిన శ్రీనివాసులు(30), వెంకటేశ్వర్లు(32) ఇద్దరూ బాంబు పేలినచోలును పరిశీలిస్తుండగా కర్పూరం ఉండలాంటిది కనిపించింది. శ్రీనివాసులు దాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలిస్తుండగా చేతిలోనే పేలిపోయి అతని రెండు చేతుల వేళ్లు తెగిపోయాయి. పక్కనున్న వెంకటేశ్వర్లుకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే చీరాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గుడి వద్ద పేలినవి నాటు బాంబులేనని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement