నేడు సింగపూర్‌కు కేటీఆర్ | Today KTR Singapore trip | Sakshi
Sakshi News home page

నేడు సింగపూర్‌కు కేటీఆర్

Jun 29 2016 4:03 AM | Updated on Oct 4 2018 6:57 PM

నేడు సింగపూర్‌కు కేటీఆర్ - Sakshi

నేడు సింగపూర్‌కు కేటీఆర్

మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం సింగపూర్ బయలుదేరి వెళ్తున్నారు.

సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం సింగపూర్ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ జరిగే సౌతిండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మలేసియాకు చేరుకుని గురువారం, జూలై ఒకటిన అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరిగే మలేసియా పర్యటనలో అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అవుతారు. తిరిగి జూలై రెండో తేదీన మంత్రి  హైదరాబాద్‌కు తిరిగివస్తారు. కేటీఆర్ వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ కూడా పర్యటనకు వెళుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement