లక్ష్మీదేవమ్మ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ | third phase of ys jagan mohan reddy raithu bharosa yatra fourth day in anantapur | Sakshi
Sakshi News home page

లక్ష్మీదేవమ్మ కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

Jul 24 2015 12:02 PM | Updated on Oct 1 2018 2:44 PM

అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగోరోజు కొనసాగుతోంది.

అనంతపురం: అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన రైతు భరోసా యాత్ర నాలుగోరోజు కొనసాగుతోంది. అందులో భాగంగా శుక్రవారం ఆయన పెనుకొండ నియోజక వర్గ పరిధిలోని వైటి రెడ్డిపల్లి, గోనిమాకులపల్లిలో యాత్ర నిర్వహిస్తున్నారు.  వైటిరెడ్డిపల్లి లో ఆత్మహత్యకు పాల్పడిన లక్ష్మీదేవమ్మ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు. కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. వారికి కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన అదే గ్రామంలోని పెద్ద పాతన్న కుటుంబాన్ని పరామర్శిస్తారు.

అనంతరం ఆయన గౌనిమేకలపల్లి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులు శ్రీనివాసులు, గోపినాథ్ కుటుంబాలను  పరామర్శించనున్నారు. అనంతరం కొత్తపల్లిలో రైతు లక్ష్మన్న కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. ఆ తర్వాత రొద్దం గ్రామంలో రైతులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement