బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో మరింత బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశం ఉండడంతో కోస్తాంధ్రలోని అన్ని పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
ప్రస్తుతం చెన్నైకి దక్షిణాన 448 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం రేపు రాత్రి చెన్నై-కారేకాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. చెన్నైకి తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని తీరప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.