నోవాటెల్ హోటెల్ పై పోలీసుల దాడి | sot police attacks on novotel hotel | Sakshi
Sakshi News home page

నోవాటెల్ హోటెల్ పై పోలీసుల దాడి

Feb 15 2016 9:37 AM | Updated on Sep 3 2017 5:42 PM

శంషాబాద్ నోవాటెల్ హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

శంషాబాద్: శంషాబాద్ నోవాటెల్ హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్‌లో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 95 వేల నగదుతో పాటు 10 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. హోటల్‌లో అసాంఘీక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement