మద్యం మత్తులో ఎస్‌ఐ వీరంగం | si kiran ovar action in karimnagar distirict | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఎస్‌ఐ వీరంగం

Sep 9 2015 9:12 AM | Updated on Sep 2 2018 3:51 PM

మద్యం మత్తులో ఎస్‌ఐ వీరంగం - Sakshi

మద్యం మత్తులో ఎస్‌ఐ వీరంగం

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో మంగళవారం రాత్రి ఎస్‌ఐ కిరణ్ వీరంగం సృష్టించాడు.

కరీంనగర్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింగాపూర్‌లో మంగళవారం రాత్రి ఎస్‌ఐ కిరణ్ వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో ఉన్న ఎస్ఐ ఇంటిముందు కూర్చొని స్థానికులతో మాట్లాడుతున్న శ్రీనివాస్ అనే వ్యక్తిని అకారణంగా చేయిచేసుకున్నాడు. ఎందుకు కొడుతున్నారని బాధితుడి అడిగితే బండబూతులు తిట్టాడు. కిరణ్ దాడిలో శ్రీనివాస్ కు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడు కేసు పెట్టడానికి వెళితే పోలీసులు కేసు నమోదు చేసుకోకపోవడంతో తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆందోళనకు దిగాడు. ఈ మేరకు బుధవారం ఉదయం పోలీసుఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement