గుర్మీత్‌ డేరాలో సోదాలు | Searches in the Gurmeet tent captured Luxury car | Sakshi
Sakshi News home page

గుర్మీత్‌ డేరాలో సోదాలు

Sep 9 2017 3:20 AM | Updated on Sep 12 2017 2:16 AM

గుర్మీత్‌ సింగ్‌ ఆశ్రమం డేరా సచ్ఛా సౌదాలో రిటైర్డ్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి ఏకేఎస్‌ పవార్‌ నేతృత్వంలో సోదాలు నిర్వహించారు.

⇔ లగ్జరీ కారు, పాత కరెన్సీ స్వాధీనం

సిర్సా: ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న గుర్మీత్‌ సింగ్‌ ఆశ్రమం డేరా సచ్ఛా సౌదాలో రిటైర్డ్‌ జిల్లా, సెషన్స్‌ జడ్జి ఏకేఎస్‌ పవార్‌ నేతృత్వంలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నంబర్‌ ప్లేట్‌ లేని ఓ లగ్జరీ కారు, ఓబీ వ్యాను, రూ.7 వేలు విలువైన రద్దైన నోట్లు, మరో రూ.12 వేలు నగదును స్వాధీనం చేసుకున్నట్లు హరియాణా సమాచార, ప్రజాసంబంధాల డిప్యూటీ డైరెక్టర్‌ సతీశ్‌ మిశ్రా మీడియాకు తెలిపారు. పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాలతో నిర్వహించిన సోదాలను వీడియో తీసినట్లు పేర్కొన్నారు.

ఆశ్రమం లో పలు హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్ని గదులను సీల్‌ చేసినట్లు పేర్కొన్నారు. సిర్సాకు చేరుకున్న ఫోరె న్సిక్‌ నిపుణులు పలు ఆధారాలు సేకరించి నట్లు వెల్లడించారు. శాంతి భద్రతలు కాపాడడా నికి సిర్సాలో ఈ నెల 10 వరకు మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేశామ న్నారు. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి నివేదికను హైకోర్టుతో పాటు హరియాణా ప్రభుత్వానికి సమర్పించ నున్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement