వృద్ధుని ఆత్మహత్యాయత్నం | Old man attempted to commit suicide | Sakshi
Sakshi News home page

వృద్ధుని ఆత్మహత్యాయత్నం

Dec 29 2015 12:36 PM | Updated on Sep 3 2017 2:46 PM

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు బలవన్మరణానికి యత్నించాడు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు బలవన్మరణానికి యత్నించాడు. విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్.కోట మండలం గోపాలపల్లికి చెందిన బోని ఆంజనేయులు(75)కు నా అన్నవారెవరూ లేరు. అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఆ వృద్ధుడు జామిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉండగా గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై ఎస్.ఘని ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement
 
Advertisement
Advertisement