'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి' | Nandamuri Balakrishna demands AndhraPradesh special status | Sakshi
Sakshi News home page

'ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి'

Dec 3 2015 4:07 PM | Updated on Mar 23 2019 9:10 PM

ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీ వచ్చిన నందమూరి బాలకృష్ణ విలేకర్లతో మాట్లాడారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జరగనున్న లేపాక్షి ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు కేంద్రమంత్రులను ఆహ్వానించినట్లు చెప్పారు. హిందూపురం అభివృద్ధికి అధిక నిధులు ఇవ్వాలని నందమూరి బాలకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement