పగిలిన మంజీరా పైపులైన్ | manjeera pipeline burst in chintal | Sakshi
Sakshi News home page

పగిలిన మంజీరా పైపులైన్

Dec 2 2015 10:40 AM | Updated on Sep 3 2017 1:23 PM

మంజీరా ప్రధాన పైపు లైన్ పగిలి పోవడంతో మంచి నీరు రోడ్డుపై వృధాగా పోతోంది. కుత్బుల్లాపూర్ చింతల్ హెచ్‌ఎంటీ పరిశ్రమ ముందు భాగంలో బుధవారం పైపులు పగిలిపోయాయి.

హైదరాబాద్: మంజీరా ప్రధాన పైపు లైన్ పగిలి పోవడంతో మంచి నీరు రోడ్డుపై వృధాగా పోతోంది. కుత్బుల్లాపూర్ చింతల్ హెచ్‌ఎంటీ పరిశ్రమ ముందు భాగంలో బుధవారం పైపులు పగిలిపోయాయి. దీంతో మంజీరా నీరు వృధాగా పోతోంది. ఇది గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.
 
అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు నగర వాసులకు తాగడానికి మంచి నీరులేక ఇబ్బందులు పడుతుంటే.. ఇలా మంజీరా నీటిని రోడ్డు పాలు చేస్తున్నారని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement