ట్రాన్స్ ఫర్ చేయలేదని ఆత్మహత్య | man commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

ట్రాన్స్ ఫర్ చేయలేదని ఆత్మహత్య

Mar 7 2016 3:50 PM | Updated on Aug 29 2018 8:38 PM

తను కోరుకున్న చోటకి బదిలీ చేయలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

హైదరాబాద్: తను కోరుకున్న చోటకి బదిలీ చేయలేదని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నగరంలోని కుషాయిగూడలో చోటు చేసుకుంది. స్థానిక ఎన్‌ఎఫ్‌సిలో నరేందర్ కుమార్(24) అనే యువకుడు  ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తనను కోరుకున్న చోటికి యాజమాన్యం బదిలీ చేయకపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కుషాయిగూడ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement