వరంగల్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నేతలు ఎన్నిక నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు.
వరంగల్ ఉప ఎన్నికలో అధికార టీఆర్ఎస్ నేతలు ఎన్నిక నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు క్షేత్ర స్థాయిలో ప్రచారం చేయకుండా కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు. 'టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ గెలుపు మాదే, ఎన్నిక ఏకపక్షం అని అంటున్నారు. మరి అలాంటప్పుడు ప్రచారం చేయడమెందుకు' అని గుత్తా ప్రశ్నించారు.