టీడీపీలో 'శంకుస్థాపన' చిచ్చు | foundation flexi war in tdp | Sakshi
Sakshi News home page

టీడీపీలో 'శంకుస్థాపన' చిచ్చు

Oct 21 2015 2:20 PM | Updated on Aug 10 2018 8:16 PM

అమరావతి శంకుస్థాపన కోసం ఏర్పటు చేసుకున్న ఫ్లెక్సీల విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది.

పుంగనూరు: అమరావతి శంకుస్థాపన కోసం ఏర్పటు చేసుకున్న ఫ్లెక్సీల విషయంలో జరిగిన గొడవ చిలికి చిలికి గాలి వానలా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజక వర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఫ్లెక్సీల విషయంలో నిప్పు చెలరేగింది. జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు చల్లబాబు వర్గానికి చెందిన కొందరు మరో నేత శ్రీనాథ్ రెడ్డి వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేయడంతో.. ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో వివాదం పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. శ్రీనాథ్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



 

Advertisement
 
Advertisement
Advertisement