'సుధాకార్స్' లో అగ్నిప్రమాదం | fire accident in sudhacars | Sakshi
Sakshi News home page

'సుధాకార్స్' లో అగ్నిప్రమాదం

Aug 20 2015 1:59 PM | Updated on Sep 5 2018 9:45 PM

'సుధాకార్స్' లో అగ్నిప్రమాదం - Sakshi

'సుధాకార్స్' లో అగ్నిప్రమాదం

నగరంలోని బహదూర్ పురాలోని సుధాకార్స్ (బుల్లికార్ల మ్యూజియం)లో అగ్నిప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: నగరంలోని బహదూర్ పురాలోని సుధాకార్స్ (బుల్లికార్ల మ్యూజియం)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే జరిగి ఉంటుందని మ్యూజియం అధికారులు భావిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు వారు తెలిపారు.
 
ఇనుప స్క్రాప్స్ తో విభిన్న రూపాల్లో చిన్న చిన్న కార్లను తయారు చేసి సుధాకార్స్ మ్యూజియంలో ప్రదర్శిస్తుంటారు. కాగా ఈ మధ్యే గవర్నర్ నరసింహన్ సుధాకార్స్ ని సందర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement