breaking news
bahadur pura
-
ఇది బంతి కాదు.. కారు!
హైదరాబాద్, బహదుర్‌పురా చౌరస్తాలో శనివారం ఫుట్‌బాల్ కారు చక్కర్లు కొట్టింది. స్థానికులు దీనిని చూసి.. ఔరా.. అంటూ ఆశ్చర్యచకితులయ్యారు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ నేపథ్యంలో సుధాకార్స్ మ్యూజియం సృష్టికర్త కె.సుధాకర్ నాలుగు నెలలు శ్రమించి ఈ చిట్టి కారును రూపొందించారు. 150 సీసీ ఇంజిన్‌తో ఆరు చక్రాలతో తయారు చేసిన ఈ బంతికారు సింగిల్ సీట్‌తో.. గంటకు 40 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్తుందని ఆవిష్కర్త సుధాకర్ పేర్కొన్నారు. తాను ఇప్పటివరకు 250కిపైగా రకాల కార్లను తయారు చేశానని చెప్పారు. -
'సుధాకార్స్' లో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని బహదూర్ పురాలోని సుధాకార్స్ (బుల్లికార్ల మ్యూజియం)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన గురువారం మధ్యాహ్నం జరిగింది. సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగానే జరిగి ఉంటుందని మ్యూజియం అధికారులు భావిస్తున్నారు. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు వారు తెలిపారు. ఇనుప స్క్రాప్స్ తో విభిన్న రూపాల్లో చిన్న చిన్న కార్లను తయారు చేసి సుధాకార్స్ మ్యూజియంలో ప్రదర్శిస్తుంటారు. కాగా ఈ మధ్యే గవర్నర్ నరసింహన్ సుధాకార్స్ ని సందర్శించారు.


