రంజాన్ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు


హైదరాబాద్: రంజాన్ పర్వదిన సందర్భంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మీరాలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గాల వద్ద ఉదయం 8 గంటల నుంచి 11.30 వరుకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీరాలం మీదుగా నడిచే వాహనాలను పురానాపూల్, కామాటిపురా, కిషన్ బాగ్ , బహదూర్ పురా క్రాస్ రోడ్ ల మీదుగా దారి మళ్లింపు చేస్తామని చెప్పారు. ఈద్గా మీదుగా బహదూర్ పురా క్రాస్ రోడ్ వైపుగా నడిచే వాహనాలను కిషన్ బాగ్, కామాటిపురల వద్ద దారి మళ్లిస్తారు.



ఇద్గా క్రాస్ రోడ్స్ నుంచి ఇద్గా వరకు ఆటోలను అనుమతించరు. ప్రార్థనల కోసం శివరాంపల్లి, ఎన్‌పీఏ నుంచి వచ్చే వాహనాలను ఈద్గా దారిలో అనుమతిస్తారు. ఇతర వాహనాలను దానమ్మ హట్స్ టీ జంక్షన్ వద్ద దారి మళ్లించి అలియాబాద్ వయా అన్సారీ రోడ్డు, జహనుమ, బాయ్స్ టౌన్ స్కూల్ నుంచి అనుమతిస్తారు. ఈద్గా ప్రార్థనలు ముగియగానే పురానాపూల్ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. మీరాలం వద్ద అందరూ వెళ్లిపోయిన తర్వాత ట్రాఫిక్‌ను యధావిధిగా పంపిస్తారు.




 

Read also in:
Back to Top