జల్సాలకు అలవాటుపడి నగరంలో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ర్ట దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు.
శంషాబాద్ లో చైన్‌స్నాచర్ అరెస్ట్
Mar 5 2016 11:50 AM | Updated on Aug 20 2018 4:27 PM
హైదరాబాద్: జల్సాలకు అలవాటుపడి నగరంలో పలు ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ర్ట దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన గోవింద్ ఓ ముఠాను ఏర్పాటు చేసుకొని నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. ఈ ముఠా పై నిఘా పెట్టిన పోలీసులు గోవింద్‌ను శనివారం శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 25 తులాల బంగారు ఆభరణాలతో పాటు పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మరో ఇద్దరి కోసం గాలింపు చేపడుతున్నామని శంషాబాద్ డీసీపీ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
Advertisement


