కొలంబియా షాపింగ్‌ మాల్‌లో పేలుడు | Bomb blast in colombia samping mall | Sakshi
Sakshi News home page

కొలంబియా షాపింగ్‌ మాల్‌లో పేలుడు

Jun 19 2017 2:39 AM | Updated on Sep 5 2017 1:56 PM

కొలంబియా రాజధాని బొగొటా మరోసారి నెత్తురోడింది.

బొగొటా: కొలంబియా రాజధాని బొగొటా మరోసారి నెత్తురోడింది. ఆదివారం జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించారు. ఇక్కడి సెంట్రోఆండి యానో లోని రద్దీగా ఉన్న షాపింగ్‌ మాల్‌లో బాంబు పేల్చి దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ముష్కరులు రద్దీగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, పేలుళ్లలో శక్తిమంతమైన మందుగుండును ఉపయోగించారని పోలీసులు తెలిపారు.

మృతి చెందిన వారిలో 23 ఏళ్ల ఫ్రాన్స్‌ దేశ మహిళ ఉన్నట్లు చెప్పారు. ఆరునెలల క్రితం ఆమె పేదలకు సేవచేయడానికి వలంటీర్‌గా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల వెనుక దేశంలోనే అతి పెద్ద తీవ్రవాద సంస్థ అయినా నేషనల్‌ లిబరేషన్‌ ఆర్మీ లేదా ఈఎల్‌ఎన్‌ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అధ్యక్షుడు జాన్‌ మాన్యుయేల్‌ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ మరణించిన వారిపట్ల సంతాపం తెలుపుతూ ట్వీట్‌ చేశారు. గత ఫిబ్రవరిలో జరిగిన దాడుల్లో 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement