ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని వైఆర్సీపీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు.
'జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం'
Mar 16 2016 1:05 PM | Updated on Mar 28 2019 5:27 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పడుతున్నాయని వైఆర్సీపీ ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, సుభాష్ చంద్రబోస్ ఆరోపించారు. బుధవారం ఏపీ శాసనమండలి లో వారు మాట్లాడుతూ దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతోందన్నారు. సబ్ ప్లాన్ చట్టం వేసినా కూడా దళితులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంపై మంత్రి రావెల కిశోర్ బాబు సమాధానం దాట వేశరన్నారు.
Advertisement
Advertisement