‘టైటాన్’పై మంచు మేఘాలు | Sakshi
Sakshi News home page

‘టైటాన్’పై మంచు మేఘాలు

Published Fri, Nov 13 2015 9:41 AM

A monster storm is brewing on Titan: Cassini spots huge ice clouds sweeping across the south pole of Saturn's moon

లండన్ : శని గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహమైన టైటాన్‌పై భారీస్థాయిలో మంచు మేఘాలు ఉన్నట్లు  ‘నాసా’ ప్రకటించింది. టైటాన్ స్ట్రాటో ఆవరణం దిగువ మధ్యభాగంలో ఇవి ఉన్నట్లు  కేసినీ వ్యోమనౌక గుర్తించింది. టైటాన్ ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులో ఇవి ఉన్నట్లు నాసా తెలిపింది. భూమిపై ఉన్న పొగమంచు మాదిరిగా ఈ మేఘాలు అత్యల్ప సాంద్రతను కలిగి ఉన్నాయి. కాని పైభాగం మాత్రం చదునుగా ఉంది. ఇవి భూమిపై వర్షాన్నిచ్చే మేఘాల మాదిరిగా ఏర్పడవు. వెచ్చని అర్థగోళంలోని వాతావరణం నుంచి వేడి వాయువులు దక్షిణార్థగోళంలోని చల్లని ప్రాంతానికి ప్రసరిస్తాయి.

Advertisement
Advertisement