మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.
రామాయం పేట: మెదక్ జిల్లా రామాయంపేట సమీపంలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆదిలాబాద్ డిపోకు చెందిన బస్సు బాసర నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై పూర్తి వివరాలు రావాల్సి ఉంది.