ఆ శిశువులకు తల్లిపాలతో మెదడు వృద్ధి | Sakshi
Sakshi News home page

ఆ శిశువులకు తల్లిపాలతో మెదడు వృద్ధి

Published Sun, May 1 2016 3:20 PM

the infants brain growth With the mother's milk

 నెలలు నిండకుండానే జన్మించిన నవ జాత శిశువులకు తల్లిపాలను అధికంగా అందిస్తే వారిలో మెదడు అభివృద్ధి గణనీయంగా ఉంటుందని తాజా పరిశోధనలో తేలింది. నెల వయసు ఉన్న ఈ పిల్లల ఆహారంలో 50శాతానికి మించి తల్లిపాలు ఉంటే మెదడు కణజాలం ఎక్కువగా పెరుగుతుందని అమెరికాలోని సెయింట్ లూయీస్ పిల్లల ఆస్పత్రిలో జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.

 

తల్లిపాలు ఎక్కువగా తాగిన 77 మంది నెలలు నిండని పిల్లల్లో అందరిలోనూ మెదడు మెరుగైన అభివృద్ధిని ఎంఆర్‌ఐ స్కానింగ్‌ల ద్వారా గుర్తించామని వాషింగ్టన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సింథియా రోజర్స్ తెలిపారు. నెలలు నిండని పిల్లల్లో భవిష్యత్తులో నరాలసమస్యలు పెరగే అవకాశాలు ఎక్కువని ఆమె తెలిపారు.

Advertisement
Advertisement