మీడియా తంత్రం–బాబు కుతంత్రం

No Restrictions On Media In Andhra Pradesh - Sakshi

అసలే చిన్నగా ఉండే గురివింద గింజ ప్రతిపక్ష నేత చంద్రబాబును చూసి మరింత చిన్నబోతోంది. గురివింద నీతి కూడా చంద్రబాబు దుర్నీతి ముందు పనికిరాకుండాపోతోంది. అధికారం కోల్పోగానే ప్రతిపక్ష నేతకు హఠాత్తుగా మీడియా స్వేచ్ఛ గుర్తుకు వచ్చింది. పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం హరిస్తోందంటూ గగ్గోలు మొదలుపెట్టారు. ఆయన రాద్ధాంతం చూస్తేంటే...  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మీడియా నియంత్రణకు కొత్తగా చట్టం ఏమైనా చేసిందా అనే సందేహం కలుగుతుంది. తీరా చూస్తే కొత్తగా ఎలాంటి చట్టం చేయలేదు... పోనీ చంద్రబాబు తాను సీఎంగా ఉండగా ఏం చేశారో ఓసారి చూస్తే... ఆయన హయాంలో అంతా పత్రికలపై కక్ష సాధింపులు... పాత్రికేయులపై వేధింపులే కనిపిస్తున్నాయి. ఆధారసహితంగా తన ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసిన పత్రికలు, పాత్రికేయుల మీద ఏకంగా క్రిమినల్‌ కేసులు పెట్టాలని జారీ చేసిన జీవోలు ఆయన నిజస్వరూపాన్ని నిగ్గు తేలుస్తున్నాయి.

మీడియా గొంతు నొక్కుతున్నారని  వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు బురదజల్లేందుకు నానాపాట్లు పడుతున్నారు. వాస్తవం ఏమిటంటే.. మీడియాపై ఆంక్షలు విధిస్తూ కొత్తగా ఎలాంటి చట్టమూ రాలేదు. రాజ్యాంగం దేశ ప్రజలు అంద రికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. దానికిందే స్వేచ్ఛగా, నిర్భీతిగా నిజాలు చెప్పేందుకు పత్రి కలు, టీవీ చానళ్లకు రాజ్యాంగపరమైన హక్కు కల్పించింది. కానీ అదే సమయంలో అసత్య వార్తలు, నిరాధార కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా  ఆ మీడియా సంస్థలపై చట్టప రమైన  చర్యలు తీసుకునే అవకాశం, అధికారం ప్రభుత్వాలకైనా, ప్రైవేటు వ్యక్తులకైనా, సంస్థల కైనా ఉంటుంది. లేనట్టయితే ఎవరైనా ఇష్టాను సారం అసత్య వార్తలు ప్రచురించి, ప్రసారం చేసి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం, ప్రజల్లో భయాం దోళనలు సృష్టించడం రివాజుగా మారుతుంది. అందుకే ఆ జాగ్రత్త తీసుకున్నారు. ఆ ప్రకారమే తప్పుడు వార్తలు, కథనాల విషయంలో చట్టప రంగా తగిన చర్యలు తీసుకునే అధికారం ప్రభు త్వానికి మొదటి నుంచీ ఉంది.

ప్రస్తుతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా అదే చెబు తోంది. నిరాధార వార్తలు ప్రచురించి, ప్రసారం చేసి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించినా, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇదేమీ కొత్త విషయం కాదు. గతంలో  చంద్ర బాబు ప్రభుత్వంతోసహా అన్ని ప్రభుత్వాలు అను సరించిన విధానమే. అంతేగానీ కొత్తగా ఎలాంటి చట్టం లేదా జీవో తీసుకురాలేదు. అసత్య వార్తలు, కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని చెబుతోంది. అంతేగానీ విలేకరుల మీద పోలీసు కేసులు పెడతా మనిగానీ, వేధిస్తామనిగానీ ఎక్కడా చెప్పలేదు. తాము ప్రచురించిన, ప్రసారం చేసిన వార్తలు, కథ నాలు నిజాలేనని న్యాయస్థానంలో ఆధారాలు చూపించి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ పత్రి కలు, చానళ్లపై ఉంటుంది. ఆధారాలు చూపితే న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు చెబు తుంది. చూపించలేకపోతే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశ్యపూర్వకంగా అవాస్తవాలు ప్రచురించారని, ప్రసారం చేశారని నిర్ధారిస్తుంది. ఇందులో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడం అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలే దన్నది సుస్పష్టం. ప్రభుత్వం పూర్తిగా నిబంధన లకు కట్టుబడి, న్యాయసూత్రాలకు అనుగుణంగానే వ్యవహరిస్తోందన్నది ప్రాతికేయ ప్రముఖులు, ప్రజలూ అంగీకరిస్తున్న వాస్తవం. 

చంద్రబాబూ...! ఎందుకీ గగ్గోలు?! 
ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన భజన మీడియా మాత్రం గగ్గోలు పెట్టి ప్రజలను తప్పు దారి పట్టించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందంటూ అసత్య ఆరోప ణలతో రాద్ధాంతం చేసేందుకు నానాపాట్లు పడుతున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అత్యధిక మీడియా సంస్థలు చంద్రబాబు గుప్పిట్లో ఉన్నాయి. చంద్రబాబు అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులుతీస్తున్నట్లు తప్పుడు గణాం కాలు, గ్రాఫిక్‌లతో తమ పత్రికల్లో పేజీలకు పేజీలు అసత్య కథనాలు వండి వార్చడం...  టీవీ చానళ్లలో గంటల తరబడి ప్రసారం చేయడం ఆ మీడియా నైజం. బాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రభు త్వంలో అవినీతి, అరాచకం పెట్రేగిపోతోందని అవాస్తవ కథనాలను రోజూ వండివారుస్తూ పత్రి కలను నింపడం, టీవీ చానళ్లలో రాద్ధాంతం చేయడం కూడా వారికి అలవాటే. గతంలో దివం గత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో ఐదేళ్లపాటు టీడీపీ అనుకూల మీడియా ఎంతగా విషం కక్కిందో అందరికీ తెలి సిందే.

కానీ విజ్ఞులైన ప్రజలు ఆ ప్రభావానికి లోను కాకుండా వైఎస్సార్‌  సంక్షేమ, అభివృద్ధి పాలనకు జైకొట్టి 2009లో రెండోసారి గెలిపించారు. ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా మళ్లీ అదే పాట అందుకుంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసత్య కథనాలు ప్రచురించడం, ప్రసారం చేయడం నిత్యకృత్యమైంది. ప్రభుత్వం  పూర్తి పారదర్శకతతో సచివాలయ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే... పేపర్‌ లీక్‌ చేశారంటూ టీడీపీ అను కూల మీడియా అసత్య కథనాన్ని రాసింది. ప్రభుత్వ అధికారుల బదిలీలు సాధారణమేనని తెలిసినా ... ఆర్టీసీ ఎండీ బదిలీపై మరో అసత్య కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టిం చేందుకు యత్నించింది. ఇక వరదల సమయంలో టీడీపీ సోషల్‌ మీడియా విభాగం పెయిడ్‌ ఆర్టిస్టు లతో అసత్య ప్రచారం చేయడం అందరికీ తెలి సిందే.

తిరుమలలో చర్చి కడుతున్నారంటూ టీడీపీ నేతలు మరో అసత్య ప్రచారం తెరపైకి తెచ్చి రాష్ట్రంలో ఉద్రిక్తలు సృష్టించేందుకు కుట్ర పన్నారు. ఇలా టీడీపీ అనుకూల మీడియా బాబు ప్రయో జనాలు నెరవేర్చేందుకు అసత్యాలను ప్రచారం చేస్తోంది. వాటిపై ప్రభుత్వం న్యాయపరంగా వ్యవహరిస్తామంటే బాబు, ఆయన భజన మీడియా గగ్గోలు పెడుతున్నారు. వారికి నిజంగా నిజాయతీ, చిత్తశుద్ధి ఉంటే అంత రాద్ధాంతం అవసరం లేదు. వారు సచ్చీలురైతే ప్రభుత్వ నిర్ణ యాన్ని స్వాగతించేవారు. తమ కథనాలపై ప్రభుత్వం కేసు వేస్తే న్యాయస్థానంలో రుజువులు సమర్పించి  నిజాయతీ, నిబద్ధత నిరూపించుకుం టామని ప్రకటించేవారు. కానీ బాబుగానీ, ఆయన అనుకూల మీడియాగానీ ఆ మాటే అనడం లేదెం దుకు అన్నది కీలక ప్రశ్న. అంటే ఆ మీడియా సంస్థలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడానికి ఇప్పటికే నిర్ణయించుకున్నాయి. కాబట్టే తమ నిజాయతీని నిరూపించుకునేందుకు సంసిద్ధంగా లేవు. పైగా తాము ఏం రాసినా, ఏం ప్రసారం చేసినా సరే తమను ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదని, కేసులు వేయకూడదని వాదిస్తున్నాయి. అంటే తాము బట్ట కాల్చి మీద వేస్తాం... అంతా మా ఇష్టం అన్నట్లుగా ఉంది వారి తీరు. మరి ఇదేం పత్రికా స్వేచ్ఛో అన్నది వారికే తెలియాలి. పత్రికా స్వేచ్ఛ ముసుగులో అసత్య ప్రచారంతో ప్రజల్ని తప్పుదారి పట్టించడం, బాబు రాజకీయ ప్రయోజ నాలకు కోసం పని చేయడమే వారి విధానంగా ఉంది. ఈ దుర్నీతిని ప్రభుత్వం సహించాలా...?! ప్రజలు భరించాలా...?! 

బాబు హయాంలోనే వేధింపులు  
అధికారం కోల్పోగానే మీడియా స్వేచ్ఛను కాపా డాలి అంటూ మొసలి కన్నీరు కారుస్తున్న చంద్ర బాబు తాను సీఎంగా ఉండగా ఏం చేశారన్నది అందరికీ తెలుసు. తమ ప్రభుత్వం ఇష్టాను సారం చేస్తున్న అవినీతిని ఆధారాలతోసహా వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ పత్రిక, చానళ్లు, సోషల్‌ మీడియాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ చానెల్‌పై ఏకంగా అయిదు జీవోలు జారీ చేశారు. ప్రస్తుతం రాద్ధాంతం చేస్తున్న  సంఘాలు గానీ, వ్యక్తులుగానీ అప్పుడు నోరు మెదపలేదు.  క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని బాబు ఆదేశిం చడం పత్రికా స్వేచ్ఛను ఆయన ఎంతగా హరించా రన్నదానికి నిదర్శనం. అందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో మూడు జీవోలు జారీ అయ్యాయి. అదే విధంగా సాధారణ పరిపా లన(రాజకీయ) కార్యదర్శి పేరుతో మరో రెండు వచ్చాయి.

  • బాబు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు  సహాయ, పునరావాస చర్యల్లో యదేచ్ఛగా అవి నీతికి పాల్పడింది. ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఆధారాలు సేకరించి మరీ కథనాలు ప్రచురించింది. సర్వే నంబర్లతోసహా గిరిజనుల పరిహారాన్ని ఎలా కొల్లగొట్టారో వెలుగులోకి తీసు కువచ్చింది. ఈ కథనాలపై బాబు సర్కారు కనీసం ఖండన కూడా ఇవ్వలేకపోయింది. కానీ కక్షసాధింపు చర్యలకు మాత్రం పాల్పడింది. అప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ కాటమ నేని భాస్కర్, సీఆర్‌డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ను సీఎం ఆఫీసుకు పిలిపించి మరీ ‘సాక్షి’పై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఒత్తిడి చేశారు. 
  • క్రిమినల్‌ కేసులు పెట్టేందుకు శ్రీధర్‌కు అనుమతిస్తూ అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ పేరుతో జీవో ఆర్‌టీ 868 జారీ చేయించారు. 
  • అదే విధంగా జగతి పబ్లికేషన్స్‌ ఎడిటర్, ప్రింటర్, పబ్లిషర్‌లపై ప్రత్యేకంగా క్రిమినల్‌ కేసులు నమోదుకు కాటమనేని భాస్కర్‌కు అను మతించారు. ఈమేరకు అప్పటి సాధారణ పరిపా లన (రాజకీయ ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్‌ పేరుతో జీవో ఆర్‌టీ 1689 జారీ చేయించారు.  
  • అలాగే క్రిమినల్‌ కేసుల నమోదుకు చెరు కూరి శ్రీధర్‌కు అనుమతిస్తూ అప్పటి సాధారణ పరిపాలన(రాజకీయ) కార్యదర్శి నాగులపల్లి శ్రీకారం  పేరుతో జీవో ఆర్‌టీ 2151 జారీ చేయించారు. 
  • చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిపక్షంపై నిఘా పెట్టిన తీరును ఆధారాలతోసహా వెలుగు లోకి తెస్తూ ‘ప్రతిపక్షంపై రియల్‌ టైం నిఘా’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. దీనిపై కూడా అప్పటి ప్రభుత్వం ఖండన ఇవ్వలేదు. కానీ ‘సాక్షి’పై క్రిమినల్‌ కేసుల నమోదుకు అప్పటి రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సీఈవోకు అనుమతి చ్చింది. ఈమేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి అనిల్‌ చంద్ర పుణేఠా పేరుతో జీవో ఆర్‌టీ 733 జారీ చేయించింది. 

నిజాలు మాట్లాడే జర్నలిస్టులపై వేధింపులు
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పత్రికాల్లో అంతా తనకు అనుకూలంగా రాయాలి... టీవీ చానళ్లలో అంతా తనకు అనుకూలంగానే మాట్లా డాలి అన్న అనధికార శాసనాన్ని అమలు చేశారు. ప్రధానంగా టీవీ చానళ్లు ప్రసారం చేసే చర్చా గోష్టులపై టీడీపీ ప్రభుత్వం అనధికారింగా సెన్సా ర్‌షిప్‌ అమలు చేసింది. విలేకరులు నిజాలు చెప్పినా, ప్రభుత్వ అవినీతి, అసమర్థతపై ఎవరూ మాట్లాడినా సహించేవారు కాదు. ప్రముఖ పాత్రి కేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు దశాబ్దన్నరగా పలు టీవీ చానళ్లలో చర్చా వేదికలు నిర్వహిస్తు న్నారు.

ఈ పదేహేనేళ్లలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి... రాష్ట్ర విభజన వంటి సున్నితమైన అంశాలు చర్చకు వచ్చాయి. కానీ ఏ ప్రభుత్వం లోనూ ఎదురుకాని చేదు అనుభవం బాబు హయాంలో ఆయనకు ఎదురైంది. ఎన్‌టీవీలో చర్చా వేదికలో కొమ్మినేని శ్రీనివాసరావు వాస్త వాలు మాట్లాడుతుంటే చంద్రబాబు, లోకేశ్‌ సహిం చలేకపోయారు. తమకు అనుకూలంగా మాట్లా డాలని హుకుం జారీ చేశారు. తాను వాస్తవాలే మాట్లాడతానని ఆయన చెప్పడంతో బాబు సహిం చలేకపోయారు. ఎన్‌ టీవీ యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి, బెదిరించి మరీ కొమ్మినేని శ్రీనివాసరావును ఆ చానల్‌ నుంచి బయటకువెళ్లిపోయేలా చేశారు. అప్పట్లో దీనిపై ఏ పాత్రికేయ సంఘాలుగానీ మీడియా ప్రముఖులుగానీ కనీసం స్పందించనే లేదు. చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే మీడియా సమావేశాల్లో  ఆయన భజన బృందానికిచెందిన పాత్రికేయులకు తప్ప మరెవరికీ కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇచ్చేవారు కాదు. ప్రభుత్వ నిర్ణయంపై ఎవరైనా ప్రశ్నిస్తే బాబు శివాలెత్తిపోయి వారిపై చిందులు తొక్కి అవమానించిన ఉదంతాలు కోకొల్లలు.  ప్రభుత్వం అంటే తన ప్రైవేటు కంపెనీగా ఆయన ప్రవర్తించేవారు.

పత్రికా స్వేచ్ఛపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణలో  పత్రికలు, టీవీ చానళ్లు ప్రధానభూమిక పోషించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వాసం. చిన్నా, పెద్ద పత్రికలు, అన్ని టీవీ చానళ్లు మనుగడ సాగిం చేందుకు ప్రభుత్వపరంగా సహకరించాలన్నది ఆయన విధానం. అందుకే పత్రికలకు ఇచ్చే ప్రకటనల టారిఫ్‌ను పెంచుతూ ఇటీవల జరిగిన మంత్రివర్గ సమా వేశంలో నిర్ణ యించారు. 40ఏళ్ల అనుభజ్జుడినని చెప్పుకునే చంద్రబాబు మీడియాను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తప్ప గౌరవించి ఎరుగరు. కానీ జగన్‌ మోహన్‌రెడ్డి అన్ని మీడియా సంస్థల ప్రతినిధులను ఒకే రీతిలో గౌరవిస్తుండటం అందర్నీ ఆకట్టుకుంటోంది. అది కదా పత్రికా స్వేచ్ఛను గౌరవించడం అంటే అని అంతా ఆయన్ని కొనియాడుతున్నారు. – సాక్షి, అమరావతి

  • ​​​వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం 
  • మీడియా కట్టడికి  జగన్‌ ప్రభుత్వం చట్టమేమీ చేయలేదు... జీవో ఇవ్వలేదు
  • అసత్య కథనాలు వద్దన్నందుకే టీడీపీ అనుకూల మీడియా ఆక్రోశం
  • బాబు ప్రభుత్వంలో మీడియాపై బరితెగించి వేధింపులు
  • నిజాలు చెప్పిన మీడియా సంస్థలపై కక్ష సాధింపులు
  • జీవోలు జారీచేసి మరీ పాత్రికేయుల వేధింపులు
  • పత్రికా స్వేచ్ఛపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి పూర్తి గౌరవం
Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top