వారఫలాలు (12 ఏప్రిల్‌ నుంచి 18 ఏప్రిల్‌) | Weekly Horoscope From April 12th To April 18th In Sakshi Funday 2020 | Sakshi
Sakshi News home page

వారఫలాలు (12 ఏప్రిల్‌ నుంచి 18 ఏప్రిల్‌)

Apr 12 2020 6:47 AM | Updated on Apr 12 2020 6:47 AM

Weekly Horoscope From April 12th To April 18th In Sakshi Funday 2020

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక లావాదేవీల్లో కొంత మెరుగుదల కనిపిస్తుంది. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. వ్యాపారాలలో కొత్త అంచనాలతో ముందుకు సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో  ఊహించని విధంగా ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధన వ్యయం. కుటుంబంలో ఒత్తిళ్లు. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహి ణి, మృగశిర 1,2 పా.)
రహస్య విషయాలు తెలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. సంతానం ఉద్యోగాలపై శుభవార్తలు. ఆస్తి వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటి నిర్మాణాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది.  వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా అడుగువేస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కించుకుంటారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. కుటుంబంలో సమస్యలు. నేరేడు, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. రుణబాధలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులకు నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఒక లేఖ మీలో ఉత్సాహాన్నిస్తుంది. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విధుల్లో అవరోధాలు తొలగుతాయి. కళాకారులు అనుకోని అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆదాయం పెరుగుతుంది. రుణబాధల నుంచి విముక్తి. సంఘంలోనూ, కుటుంబంలోనూ గౌరవం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. ఆరోగ్యం కుదుటపడి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతితో కూడిన బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజం కాగలవు. కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. ఇంటాబయటా ఒత్తిళ్లు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఓర్పు, నేర్పుతో సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు.  ప్రముఖుల నుంచి కీలక సందేశం. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. విద్యార్థులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.  వ్యాపారాలలో ఆశించినంత లాభాలు అందుతాయి. పెట్టుబడులు మరిన్ని రాగలవు. ఉద్యోగాలలో చిక్కులు, చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు  శుభవర్తమానాలు అందుతాయి. ధనవ్యయం. అనారోగ్యం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. దూరప్రయాణాలు ఉండవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. మిత్రులతో కొన్ని విషయాల్లో అవగాహనకు వస్తారు. శుభకార్యాల నిర్వహణపై కుటుంబసభ్యులతో చర్చిస్తారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఊరిస్తాయి. పనిభారం తప్పదు. కళారంగం వారికి కాస్త ఊరట లభిస్తుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. నీలం, నేరేడు రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు మందకొడిగానే సాగుతాయి.  ఆరోగ్యపరమైన చికాకులు ఉంటాయి. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. పెట్టుబడుల్లో తొందరపాటు వద్దు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు జరిగే అవకాశం. పారిశ్రామికవర్గాలకు కొద్దిపాటి సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. నీలం, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఉత్సాహంగా పనులు చేపట్టి  విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారంతో ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులు సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. క్రీడాకారులకు ఊహించని గౌరవం లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు తీరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సమర్థతను చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు శుభవర్తమానాలు. వారం చివరిలో శ్రమాధిక్యం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శత్రువులను సైతం మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాల విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలు కొత్త కంపెనీల ఏర్పాటులో నిమగ్నమవుతారు. వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని తీరతాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. వ్యాపారాలలో  అనుకున్న లాభాలు దక్కుతాయి. పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగాలలో కోరుకున్న రీతిలో పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి కొత్త ఆశలు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తి్తనిస్తాయి. యత్నకార్యసిద్ధి. ప్రత్యర్థులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. గత స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు రాగలవు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో  కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో విధుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు  కొత్త సంస్థల ఏర్పాటు యత్నాలు కలిసివస్తాయి. వారం మధ్యలో సోదరులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.  కాంట్రాక్టర్లకు కలసివచ్చేకాలం. వాహనాలు,స్థలాలు కొంటారు. విచిత్రమైన సంఘటనలు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కళాకారులకు అవకాశాలు దగ్గరకు  వస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement