వాసన మాయం సబ్బు శాశ్వతం | Stainless Steel | Sakshi
Sakshi News home page

వాసన మాయం సబ్బు శాశ్వతం

Jun 4 2016 11:39 PM | Updated on Sep 4 2017 1:40 AM

వాసన మాయం సబ్బు శాశ్వతం

వాసన మాయం సబ్బు శాశ్వతం

చేపల కూరను చాలామంది ఇష్టపడతారు. అది ఎంత రుచిగా ఉంటుందో.. వాటిని శుభ్రం చేశాక మన చేతులు అదే రేంజ్‌లో వాసన వేస్తాయి.

చేపల కూరను చాలామంది ఇష్టపడతారు. అది ఎంత రుచిగా ఉంటుందో.. వాటిని శుభ్రం చేశాక మన చేతులు అదే రేంజ్‌లో వాసన వేస్తాయి. ఎన్ని రకాల సబ్బులు వాడినా ఒక పట్టాన వాసన వదలదు... అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఆ కోవకే వస్తాయి. ఆ సమస్య నుంచి మనల్ని బయట పడేసేందుకు వచ్చిందే ఈ ‘రబ్ అవే బార్’.. ఇది అరగదు.. తరగదు.. కానీ మీ చేతులను శుభ్రంగా, ఎలాంటి వాసనలు లేకుండా చేస్తుంది.

దీన్ని స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేశారు. చల్లటి నీటి కింద ఈ బార్‌తో చేతులు కడుక్కుంటే చాలు. ఈ రబ్ అవే బార్‌కు, కూల్ వాటర్‌కు మధ్య జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల వాసనలు దూరమవుతాయట. ఇదేదో బాగుంది కదూ... ఒక్కసారి కొనేస్తే సరి. ఎన్ని రోజులైనా దీన్ని హాయిగా వాడుకోవచ్చు. ఇవి వివిధ రకాల షేపుల్లో, సైజుల్లో దొరుకుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement