విదేశాల్లో రియల్ ఇండియా! | real india in foriegn country | Sakshi
Sakshi News home page

విదేశాల్లో రియల్ ఇండియా!

Feb 2 2014 12:48 AM | Updated on Oct 4 2018 7:01 PM

విదేశాల్లో రియల్ ఇండియా! - Sakshi

విదేశాల్లో రియల్ ఇండియా!

మనదేశం పేదది అని మన వాళ్లు కొందరు అంటున్నారు గాని విదేశీయులు ఎవరూ అలా అనుకోవడం లేదట.

 కిచిడీ
  మనదేశం పేదది అని మన వాళ్లు కొందరు అంటున్నారు గాని విదేశీయులు ఎవరూ అలా అనుకోవడం లేదట. అమెరికాలో అయితే గత ఏడాది టాప్-5 ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ బయ్యర్స్‌లో ఇండియా కూడా ఒకటి! ప్రపంచంలోనే ఖరీదైన ప్రాంతాలుగా భావించే లండన్‌లోని కెన్సింగ్‌స్టన్, బెల్‌గ్రేవియా, హాలండ్ పార్క్, దుబాయ్‌లోని బుర్జ్ దుబాయ్, సింగపూర్‌లోని నాసిమ్ రోడ్‌లలో ఇండియన్ బిలియనీర్లు సులువుగా ఆస్తులు కొనేస్తున్నారు. ఇవి ప్రపంచంలో రియల్టర్లకు ఫ్యాన్సీ ప్రదేశాలు. ఇలాంటి చోట ఇళ్లు కొనడాన్ని భారతీయులు ఒక హోదాగా భావిస్తున్నారట. ఇంకా వీటితో పాటు లాస్ ఏంజెల్స్, మియామి (అమెరికా), రోమ్ (ఇటలీ), టోక్యో(జపాన్), మెల్‌బోర్న్, సిడ్నీ (ఆస్ట్రేలియా) నగరాల్లోనూ ఈ బిలియనీర్లు ఇళ్లు కొంటున్నారు.
 
 ఆఫీసు పని ఈజీ
 
 మనం ఎన్నో వెబ్‌సైట్లు ఓపెన్ చేస్తుంటాం. కానీ మనం రోజూ వినే పదాలతో వెబ్‌సైట్లు ఏమున్నాయో ఎప్పుడైనా చూశారా? గాడ్.కాం, మ్యాన్.కాం, విమెన్, ట్రీ, లవ్, ఆఫీస్... ఇలాగ వీటిని చాలా మంది జీవితంలో ఒక్కసారి కూడా ఓపెన్ చేసి ఉండరు. అలాంటి పదాల్లో ఒకటి మనం రోజూ వినే ‘ఆఫీస్’. మీరెప్పుడైనా ఆఫీస్.కాంలోకి వెళ్లారా? ఇది మైక్రోసాఫ్ట్ వారి వెబ్‌సైట్. ఇందులో మీరు ఆఫీసుకు సంబంధించిన పేపర్ వర్క్‌లకు అవసరమైన టెంప్లెట్లు, క్లిప్‌ఆర్ట్‌లు, ఇమేజ్‌లు ఉంటాయి. సో... ఇక నుంచి గూగుల్‌లో గంటల తరబడి వెతక్కుండా మీకు కావలసిన దానికోసం నేరుగా ఈ ఆఫీస్.కామ్‌కు వెళ్లండి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement