అదే క్రిస్మస్‌కు నిజమైన అర్థం! | jayasudha says about god of jesus! | Sakshi
Sakshi News home page

అదే క్రిస్మస్‌కు నిజమైన అర్థం!

Dec 20 2015 1:56 AM | Updated on Sep 3 2017 2:15 PM

అదే క్రిస్మస్‌కు నిజమైన అర్థం!

అదే క్రిస్మస్‌కు నిజమైన అర్థం!

‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు’... ప్రతి క్షణం నేను గుర్తుంచుకునే వాక్యమిది.

‘నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు’... ప్రతి క్షణం నేను గుర్తుంచుకునే వాక్యమిది. ఎదుటి వారిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఈర్ష్యాద్వేషాలకు చోటుండదు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు. నా దృష్టిలో  క్రిస్మస్ అనేది అందరికీ సంబంధించిన పండగ. కానీ సెలబ్రేషన్స్‌తో పాటు షేరింగ్ కూడా ఉండాలని నా ఉద్దేశం. అందుకే యేటా ఈ రోజున కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూంటా. మనకున్న దానిలో కొంత పేదలకు ఇస్తే అందులో ఉండే తృప్తి, ఆనందం వేరు. అదే క్రిస్మస్‌కి నిజమైన అర్థం.

మాది బ్రహ్మసమాజం కమ్యూనిటీకి చెందిన కుటుంబం.  నేను 2001లో క్రైస్తవ మతాన్ని ఆచరించడం మొదలుపెట్టాక ఎవరూ అడ్డు చెప్పలేదు. యూకేజీ వయసులోనే నేను చర్‌‌చకు వెళ్లేదాన్ని. అప్పటి నుంచే జీసస్‌తో కొంత అనుబంధం ఏర్పడింది. అప్పట్లో అంత సీరియస్‌గా తీసుకోలేదు. కానీ 1985లో జరిగిన ఓ ప్రమాదం నన్ను పూర్తిగా మార్చేసింది. మరణం అంచుల దాకా వె ళ్తున్న నన్ను జీసస్ రక్షించాడని నా నమ్మకం. అందుకే ఆయన మార్గంలో వెళ్లడం మొదలుపెట్టా. క్రైస్తవ మార్గంలో వెళ్లడమంటే  జీసస్‌లా అందరితో ప్రేమగా ఉండటమే!
 - జయసుధ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement