అత్త లేని కోడలు... ఉత్తమురాలే! | Hindhi dubbed serial Atha Leni Kodalu Uttamuralu Serial | Sakshi
Sakshi News home page

అత్త లేని కోడలు... ఉత్తమురాలే!

Feb 27 2016 10:19 PM | Updated on Sep 3 2017 6:33 PM

అత్త లేని కోడలు... ఉత్తమురాలే!

అత్త లేని కోడలు... ఉత్తమురాలే!

ఏడుగురు మగవాళ్లు ఉండే ఇల్లు అది. తాత... తండ్రి... ఐదుగురు కొడుకులు.

ఏడుగురు మగవాళ్లు ఉండే ఇల్లు అది. తాత... తండ్రి... ఐదుగురు కొడుకులు. పెద్ద కొడుకు భార్య వల్ల వచ్చిన సమస్యలతో మనసు వికలమైన తండ్రి... తన ఇంటి మీద ఎప్పటికీ ఆడనీడ పడకూడదనుకుంటాడు. ఇక ఎవ్వరినీ పెళ్లి గురించి ఆలోచించవద్దంటాడు. కానీ రెండో కొడుకైన హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. తండ్రికిష్టం లేక పోయినా ఎలాగో పెళ్లాడి భార్యను ఇంటికి తీసుకొస్తాడు. అత్త కూడా లేని ఆ ఇంటికి తను అమ్మ అవుతుంది హీరోయిన్. అందరికీ సేవలు చేస్తుంది.

అందరి మనసుల్లోనూ స్థానం సంపాదిస్తుంది. కానీ ఆమెలా మరొకరు ఉండరు కాబట్టి ఇంకెవరికీ పెళ్లిళ్లు చేయనంటాడు తండ్రి. అయినా మిగతావాళ్లూ ప్రేమలో పడతారు. వాళ్లందరికీ ఆ కోడలు ఎలా పెళ్లిళ్లు చేసింది, బావగారి కాపురాన్ని ఎలా చక్కదిద్దింది, సమస్యలన్నీ ఎలా పరిష్కరించింది అనేది ‘సాస్ బినా ససురాల్’ సీరియల్లోని మిగతా కథ. ఈ సీరియల్ ఇటీవలే ‘అత్త లేని కోడలు ఉత్తమురాలు’గా తెలుగులో మొదలైంది. చక్కని కుటుంబ కథనాలను మనవాళ్లు ఎంతో ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా వాళ్ల మనసులను గెలుచుకునే అవకాశమూ ఉంది. మరీ ముఖ్యంగా ఆదర్శనీయంగా ఉండే హీరోయిన్ పాత్ర అందరికీ నచ్చి తీరుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement