హెల్త్‌కార్నర్ | Health Corner | Sakshi
Sakshi News home page

హెల్త్‌కార్నర్

Jul 24 2016 12:25 AM | Updated on Sep 4 2017 5:54 AM

హెల్త్‌కార్నర్

హెల్త్‌కార్నర్

జలుబు, దగ్గుతో బాధపడేవారు ఇంట్లోనే టర్మరిక్ టానిక్ తయారు చేసుకోవచ్చు.

జలుబు, దగ్గుతో బాధపడేవారు ఇంట్లోనే టర్మరిక్ టానిక్ తయారు చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనెను తీసుకొని ఓ గిన్నెలో వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు టీ స్పూన్ చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
 
⇒ రోజూ మూడుపూటలా నాలుగుచొప్పున ఎండుద్రాక్షను తింటే... రక్తంలో చక్కెర స్థాయి స్థిరంగా ఉంటుంది.
 
⇒ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గ్లాసు మంచినీరు తాగడం వల్ల గుండెపోటు రాకుండా ఉంటుంది. అలాగే స్నానం చేసే ముందు గ్లాసు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
 
⇒ డిప్రెషన్‌లో ఉన్నప్పుడు నిమ్మకాయను ముక్కు దగ్గరకు పెట్టుకొని వాసన చూడాలి. అలా చేస్తే స్ట్రెస్ తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది.
 
⇒ బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు... గోరువెచ్చని నీటితో ఒక ఫిష్ ఆయిల్ ట్యాబ్లెట్‌ను వేసుకోవాలి. దాంతో త్వరగా ఉపశమనం లభిస్తుంది.
 
⇒ వేడి నీళ్లలో 1 టీ స్పూన్ సోంపును వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి, అందులో టీ స్పూన్ తేనెను కలిపి మూడుపూటలా తీసుకుంటే... ఎసిడిటీ సమస్య తగ్గుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement