కొవ్వు  పదార్థాలు తినొచ్చా?

Funday crime story - Sakshi

సందేహం

గర్భిణులు కొవ్వు పదార్థాలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని చదివాను. ఇది ఎంత వరకు నిజం? ఏయే పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందనే విషయం మీద నాకు పెద్దగా అవగాహనలేదు. కాస్త వివరంగా తెలియజేయగలరు. – జి.మయూరి, నెల్లిమర్ల
గర్భిణీగా ఉన్న సమయంలో సాధారణంగా తీసుకునే ఆహారం కంటే 300 క్యాలరీల ఆహారం ఎక్కువగా తీసుకోవడం మంచిది. అధిక క్యాలరీలు తల్లిలో మార్పులకు, బిడ్డ పెరుగుదలకు ఉపయోగపడతాయి. తల్లి ఆహారంలో 50 శాతం కార్బోహైడ్రేట్లు, 25 శాతం ప్రొటీన్లు, 25 శాతం కొవ్వు ఉంటే, బిడ్డ పెరుగుదల ఆరోగ్యంగా ఉంటుంది. తల్లి తీసుకునే ఆహారంలో కొవ్వు బిడ్డలోని నాడీ వ్యవస్థ, కళ్లు ఏర్పడటానికి, హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడతాయి. తల్లి మరీ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బిడ్డలోని కాలేయం(లివర్‌) కణాలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశోధకుల అంచనా. దానివల్ల బిడ్డలో రోగనిరోధకశక్తి తగ్గడం, ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే బిడ్డ అధిక బరువు, తర్వాతి కాలంలో షుగర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లి ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవడం వల్ల, కొంతమంది పిల్లల్లో మెదడు ఎదుగుదలపై ప్రభావం పడి, వారిలో ఆందోళన, డిప్రెషన్‌ వంటి మానసిక సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉండవచ్చు అని పరిశోధకుల విశ్లేషణ. జంక్‌ఫుడ్స్, వేపుడ్లు, గుడ్లు, మాంసం, చీజ్, బటర్, డ్రై ఫ్రూట్స్, నూనె వస్తువులు, కొన్ని రకాల చేపలు, వంటి ఆహారంలో కొవ్వు అధికంగా ఉంటుంది. వీటిలో పాలు, పెరుగు, గుడ్లు, కొద్దిగా మాంసం, డ్రై ఫ్రూట్స్‌ వంటివి మితంగా తీసుకోవడం మంచిది. అంతేకాని అసలు తీసుకోకుండా ఉండకూడదు. ఎందుకంటే బిడ్డ ఎదుగుదలకు 25 శాతం ఆహారంలో కొవ్వు ఉండాలి. 

మా కజిన్‌ చాలా చురుకైన అమ్మాయి. ప్రస్తుతం తను ప్రెగ్నెంట్‌. కారణం తెలియదుగానీ తన స్వభావానికి విరుద్దంగా మూడీగా ఉంటోంది. ఒంటరితనాన్ని ఇష్టపడుతోంది. దీన్ని ప్రెనెటెల్‌ డిప్రెషన్‌  అంటారని, సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయం కాదని కొందరంటున్నారు. మరికొందరేమో దీని వల్ల పుట్టబోయే బిడ్డకు తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు. నాకు ఆందోళనగా ఉంది. సలహా ఇవ్వగలరు.  – పి.సంతోషి, మచిలీపట్నం
కొంతమంది గర్భం దాల్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా వచ్చే మార్పులతో, హార్మోన్లలో మార్పులతో డిప్రెషన్‌లోకి వెళ్లడం జరుగుతుంది. దీన్నే ప్రెనెటెల్‌ డిప్రెషన్‌ అంటారు. మొదటి మూడునెలలు వికారం, వాంతులు, నీరసం, నిద్ర పట్టకపోవడం వంటి లక్షణాలతో ఆందోళన చెందడం జరుగుతుంది. అలాగే, శారీరక మార్పులు, బరువు పెరగడం, ఆయాసం, ఓపిక లేకపోవడం, నడుం నొప్పులు, వంటి ఇబ్బందులు, కొందరిలో ఆర్థిక పరిస్థితులు, కొందరిలో భర్తకి తనమీద శ్రద్ధ తగ్గుతుందేమోనని ఆందోళన వంటి అనేక కారణాల వల్ల కొంతమంది గర్భిణీలు ప్రెనెటెల్‌ డిప్రెషన్‌లోకి వెళ్లడం జరుగుతుంది. కొందరిలో వాళ్లు వీళ్లు చెప్పిన మాటలు వినడం, వేరే వాళ్లకు వారి గర్భంలో వచ్చిన సమస్యలు వినడం, ఇంటర్‌నెట్‌ ఎక్కువగా వాడటం, అందులో ఉన్న కాంప్లికేషన్స్‌ తమకూ వస్తాయేమోని ఆందోళన, బిడ్డకి ఏమైనా సమస్యలు వస్తాయేమోనని భయం, బిడ్డని ఎలా చూసుకోవాలి, వంటి ఆలోచనలు, భయాలతో కూడా కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లడం జరుగుతుంది. దీనివల్ల వీరు ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, డల్‌గా ఉండటం, ఒంటరిగా ఉండటం, ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకపోవడం, ఏడుపు రావడం, వంటి అనేక లక్షణాలు ఏర్పడుతుంటాయి. దీనివల్ల బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలలో కూడా సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి చికిత్సలో భాగంగా కౌన్సిలింగ్, కుటుంబ సభ్యుల సహకారం, భర్త ప్రేమగా తనతో మాట్లాడటం, సమయం కేటాయించడం, బయటకు తీసుకువెళ్లడం వంటివి చెయ్యడం వల్ల వీరు చాలావరకు డిప్రెషన్‌ నుంచి బయటపడతారు. అలాగే యోగా, మెడిటేషన్, నడక వంటివి చెయ్యడం వల్ల చాలావరకు డిప్రెషన్‌ నుంచి బయటపడవచ్చు. ఇన్ని విధాల ప్రయత్నించినా, ఉపశమనం లేనప్పుడు యాంటి డిప్రెసంట్స్‌ మందులు డాక్టర్‌ పర్యవేక్షణలో అతి తక్కువ డోస్‌లో కొద్దిగా రిస్క్‌ తీసుకుని వాడవచ్చు. 

నా వయసు 33. ముప్ఫై దాటాక పెళ్లి చేసుకున్నాను. తర్వాత ఏడు నెలలకే గర్భం దాల్చాను. స్కానింగ్‌లో ఫెయింట్‌ ఫీటల్‌ అని రావడంతో అబార్షన్‌ చేశారు. మళ్లీ ఆరు నెలలకు గర్భం దాల్చాను. అప్పుడూ అంతే. రెండో అబార్షన్‌ తర్వాతి నుంచి కడుపులో నొప్పి వస్తోంది. మరో డాక్టర్‌ని కలిస్తే అబార్షన్‌ చేసినప్పుడు గర్భసంచికి గీత పడింది అంటున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు నాకు ఆరోగ్యకరమైన గర్భం ఎందుకు రావడం లేదు? నాకు బిడ్డ కావాలి. సలహా ఇవ్వండి.– రత్నం, అడ్డతీగల 
గర్భం గర్భసంచిలో మొదలయ్యి అందులో పిండం ఏర్పడుతుంది. ఆరు వారాలకు దాని గుండె కొట్టుకో వడం మొదలవుతుంది. కొందరికి హార్మోన్ల అసమ తుల్యత లేదా జన్యుపరమైన కారణాల వల్ల పిండం సరిగ్గా ఏర్పడదు. గర్భంలో పిండం పెరగదు. దీనినే ఆ జీజజ్టి ౖఠ్చిఝ అంటారు. కొందరిలో పిండం ఏర్పడు తుంది కానీ గుండె కొట్టుకోదు. లేదా కొన్నిరోజుల తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొన్నిసార్లు అండం నాణ్యత సరిగ్గా లేకపోయినా, తల్లిదండ్రుల్లో జన్యు సమస్యలు ఉన్నా కూడా పిండం పెరగకపోవచ్చు. థైరాయిడ్‌తో పాటు ఇతరత్రా హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీఓ, మధుమేహం, రక్తంలో యాంటీ ఫాస్పాలిపిడ్‌ యాంటిబాడీస్‌ వంటివి ఉన్నా కూడా మొదటి మూడు నెలల్లో పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు అవుతుంటాయి. అబార్షన్‌ చేసేటప్పుడు కొన్నిసార్లు గర్భసంచికి చిల్లుపడే అవకాశం ఉంటుంది. మీరు గీత పడింది అన్నదానికర్థం ఇదే అనుకుంటు న్నాను. అలాంటివి మెల్లగా మానిపోతాయి. కాకపోతే మళ్లీ వెంటనే గర్భం దాల్చకుండా కొన్ని నెలలు ఆగితే మంచిది. కొంతమందికి 30, 35 యేళ్లు దాటిన తర్వాత అండాల నాణ్యత తగ్గడం వల్ల కూడా పిండం సరిగ్గా ఏర్పడక అబార్షన్లు జరుగుతుంటాయి. బరువు ఎక్కు వుంటే తగ్గడానికి ట్రై చేయండి. రెండుసార్లు అబార్షన్‌ తప్పలేదు కాబట్టి మీలో ఇంకేమైనా సమస్యలున్నా యేమో తెలుసుకోవడం మంచిది. కాబట్టి ఇఆ్క, ఉ ఖ, ౖఎఖీఖీ, ఊ ఏ, ఖీ ఏ, అ్కఅ,  ట. అ్కఖీఖీ పరీక్షలతో పాటు షుగర్, ప్రొలాక్టిన్‌ వంటి హార్మోన్‌ టెస్టులు కూడా చేయించుకోండి. ఏదైనా తేడా ఉంటే ముందు నుంచే చికిత్స తీసుకుంటూ గర్భం కోసం ప్రయత్నించండి. అవసరమైతే భార్యాభర్తలిద్దరూ ఓ్చటy్టౌypజీnజ అనే జన్యుపరీక్ష చేయించుకుని, ఏవైనా జన్యు సమస్యలుంటే కౌన్సెలింగ్‌కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే గర్భం దాల్చ డానికి మూడు నెలల ముందు నుంచే ఫోలిక్‌ యాసిడ్‌ మాత్రలు రోజుకొకటి చొప్పున తీసుకోండి.     
- డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో హైదర్‌నగర్‌
హైదరాబాద్‌ 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top