ఎప్పటికప్పుడు... వేడివేడిగా..! | From time to time ... cool ..! | Sakshi
Sakshi News home page

ఎప్పటికప్పుడు... వేడివేడిగా..!

Nov 16 2014 1:00 AM | Updated on Sep 5 2018 2:07 PM

ఎప్పటికప్పుడు... వేడివేడిగా..! - Sakshi

ఎప్పటికప్పుడు... వేడివేడిగా..!

ఇంట్లో ఉండేవాళ్లు రెండు పూటలా పొగలు కక్కే వేడి వేడి భోజనం లాగిస్తారు. కానీ ఉద్యోగాలను చేసుకునేవాళ్లకి ఆ అదృష్టం ఒక్కపూటే.

ఇంట్లో ఉండేవాళ్లు రెండు పూటలా పొగలు కక్కే వేడి వేడి భోజనం లాగిస్తారు. కానీ ఉద్యోగాలను చేసుకునేవాళ్లకి ఆ అదృష్టం ఒక్కపూటే. పొద్దున్నే లేచి, భోజనాన్ని బాక్సులో సర్దుకుని ఆఫీసుకు పరుగులు పెడతారు. తీరా తినే సమయానికి అది కాస్తా చల్లబడిపోయి, చప్పబడిపోయి నోటికి రుచించదు. అదే ఈ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్ కొనుక్కున్నారనుకోండి, ఎక్కడ ఉన్నా, ఏ సమయంలోనైనా చక్కగా వేడి వేడి భోజనం లాగించవచ్చు.
 
అన్నం, కూర పెట్టుకోవడానికి వీలుగా రెండు అరలతో ఉండే ఈ లంచ్‌బాక్సు కరెం టుతో పని చేస్తుంది. దీనికున్న వైరును కరెంటుకు కనెక్ట్ చేస్తే... ఐదు నిమిషాల్లో బాక్సులో ఉన్న ఆహారం వేడెక్కిపోతుంది. కాబట్టి తినే సమయానికి భోజనం చల్లారిపోయినా బెంగపడక్కర్లేదు. చద్ది తిండీ తినక్కర్లేదు. వచ్చింది చలికాలం కాబట్టి ఇది చాలా అవసరం కూడాను. ప్రయాణాలప్పుడు కూడా బాగా ఉపయోగపడుతుంది. వెల పెద్ద ఎక్కువేం కాదు.1600 రూపాయల వరకూ ఉంది. ఆన్‌లైన్‌లో ప్రయత్నిస్తే రూ.1300 లోపే కొనుక్కోవచ్చు!
 

Advertisement
 
Advertisement
Advertisement