పంచామృతం: ఫేవరెట్ సినిమా | Favourite cinema of the week | Sakshi
Sakshi News home page

పంచామృతం: ఫేవరెట్ సినిమా

Apr 6 2014 2:40 AM | Updated on Aug 11 2018 8:27 PM

పంచామృతం: ఫేవరెట్ సినిమా - Sakshi

పంచామృతం: ఫేవరెట్ సినిమా

మీకు ఇష్టమైన సినిమా ఏది? అని అడిగితే టకటకా అనేక సినిమాల పేర్లు చెప్పేస్తారు ఎవరైనా. అయితే అన్నింటికన్నా చాలా ఇష్టమైనది ఏది? ఒకే ఒక్క పేరు చెప్పమని అడిగితే మాత్రం చాలా తటపటాయించాల్సి ఉంటుంది.

మీకు ఇష్టమైన సినిమా ఏది? అని అడిగితే టకటకా అనేక సినిమాల పేర్లు చెప్పేస్తారు ఎవరైనా. అయితే అన్నింటికన్నా చాలా ఇష్టమైనది ఏది? ఒకే ఒక్క పేరు చెప్పమని అడిగితే మాత్రం చాలా తటపటాయించాల్సి ఉంటుంది. చూసిన వాటిల్లో బెస్ట్ ఏదో చెప్పడం చాలా కష్టమైన పని. మరి అలాంటి కష్టమైన పరీక్షను కొంత మంది సెలబ్రిటీలకు పెడితే?
 
 ఎడ్డీమర్ఫీ ‘కమింగ్ టు అమెరికా’ హ్యూమర్‌కు ఒక నిర్వచనంలా నిలిచిపోతుంది.
 ఆ సినిమా అంటే నాకు బాగా ఇష్టం.
 - సచిన్ టెండూల్కర్
 
 రక్తపిశాచి ప్రేమలో పడే ఒక టీనేజ్ గర్ల్ కథ అయిన హాలీవుడ్ సినిమా ‘ట్విలైట్’ అంటే నాకు చాలా ఇష్టం.
 - తాప్సీ
 
 ‘పి.ఎస్.ఐ లవ్ యూ’ నాకు బాగా ఇష్టమైన సినిమా. అందులో హిల్లరీస్వాంక్ అంటే మరీ ఇష్టం.
 - పూనమ్ పాండే
 
 ఆమీర్‌ఖాన్, కాజోల్ నటించిన ‘ఫనా’ అంటే నాకు చాలా ఇష్టం. వాళ్లిద్దరి జోడీనే
 ఆ సినిమాకు ప్రధాన ఆకర్షణ.
 - పరిణీతి చోప్రా
 
 దిల్‌వాలే దుల్హానియే లేజాయేంగే... ప్రేమకు మంచి నిర్వచనం ఇచ్చిన సినిమా. నాకు ఇష్టమైనది. మోస్ట్ రొమాంటిక్ అది.
 - ప్రభుదేవా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement