విమర్శ-దిద్దుబాటు | Criticism-correction | Sakshi
Sakshi News home page

విమర్శ-దిద్దుబాటు

Jan 11 2015 1:10 AM | Updated on Mar 22 2019 1:41 PM

విమర్శ-దిద్దుబాటు - Sakshi

విమర్శ-దిద్దుబాటు

ఓ మాస్టర్ దగ్గర ఒకతను చిత్రలేఖనం నేర్చుకున్నాడు. మూడు రోజులు కష్టపడి ఓ ప్రకృతి దృశ్యాన్ని గీసాడు.

లోకరీతి
ఓ మాస్టర్ దగ్గర ఒకతను చిత్రలేఖనం నేర్చుకున్నాడు. మూడు రోజులు కష్టపడి ఓ ప్రకృతి దృశ్యాన్ని గీసాడు. అది ఎలా ఉందో తెలుసుకోవడానికి దాన్ని ఓ చౌరస్తాలో ఉంచి, పక్కన ఇలా రాసిన అట్టని ఉంచాడు: ‘‘దీంట్లో ఎక్కడ తప్పు కనపడితే అక్కడ ఇంటూ గుర్తు పెట్టండి.’’ ఆ సాయంత్రం అతను వచ్చి చూస్తే చిత్రం నిండా ఇంటూ గుర్తులే! దానికి యువ చిత్రకారుడు బాధపడ్డాడు. అప్పుడు మాస్టర్ అతడితో, ‘‘నువ్వు మంచి చిత్రకారుడివి. ఈ చిత్రంలో ఎలాంటి తప్పూ లేదు.

నేను రుజువు చేస్తాను. రేపు ఉదయానికల్లా దాన్నే మళ్ళీ గీసి చౌరస్తాకి తీసుకురా’’ అన్నాడు. చిత్రాన్ని ముందటిలాగే చౌరస్తాలో ఉంచి, ‘దీంట్లో తప్పు కనపడితే దయచేసి సరిదిద్దండి’ అనే అట్టని, కొన్ని రంగు పెన్సిళ్ళని ఉంచాడు గురువు. సాయంత్రం ఆ ఇద్దరూ వెళ్ళి చూస్తే ఒక్క దిద్దుబాటు కూడా కనపడలేదు. విమర్శించడం తేలిక. సరిదిద్దడం కష్టం.

Advertisement
 
Advertisement
Advertisement