జస్ట్.. లైట్ తీస్కో!... | visakhapatnam city plus | Sakshi
Sakshi News home page

జస్ట్.. లైట్ తీస్కో!...

May 1 2015 12:04 PM | Updated on May 3 2018 3:17 PM

జస్ట్.. లైట్ తీస్కో!... - Sakshi

జస్ట్.. లైట్ తీస్కో!...

ఉరుకుల పరుగుల జీవితాలు. ప్రశాంతంగా కప్పు కాఫీ తాగడానికి కూడా టైం లేని రోజులు.

ఉరుకుల పరుగుల జీవితాలు. ప్రశాంతంగా కప్పు కాఫీ తాగడానికి కూడా టైం లేని రోజులు. మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది. దాని వల్ల నిద్రపోవడానికి కూడా లేట్ అయ్యింది. ఉదయాన్నే ఆఫీస్‌లో మీటింగ్ ఉంది. గబగబ లేచి రెడీ అయ్యి ఆఫీస్‌కు వెళ్లాలి. ఆ తొందరలో పొరపాటున ప్యాంట్ వేసుకోవడం కూడా మరచిపోయే వాళ్లు ఉంటారు. అలా ఎవరుంటారు అంటారా? ఒక్కసారి చింతకాయల రవి సినిమా చూడండి.
 
 ఇంటర్వ్యూకు పిలిచారు కదా అని ప్యాంట్ వేసుకోవడం మరచిపోయి మేనేజర్ దగ్గరకు వెళ్లిపోతాడు వెంక టేష్. అలాంటి టైంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా!!! కానీ ఏడాదికోరోజు సరదాగా ఫ్యాంట్ విప్పేసి తిరిగితే ఎలా ఉంటుంది...హౌ ఫన్నీ! అంటూ విదేశాల్లో విద్యార్థులకు ఓ ఫన్నీ ఆలోచన తట్టింది. ఇకనేం...స్టూడెంట్స్‌కు ఓ ఆలోచన వస్తే ఇక ఆగేదేం ఉంది...వెంటనే మొదలెట్టేశారు. అకాడమిక్ సంవత్సరం సెమిస్టర్‌కు ఆఖరి రోజున ఏదైనా ఫన్నీగా చేస్తే బాగుంటుంది కదా అని కొంత మంది ఆలోచించి ఆ రోజున స్టూడెంట్స్ అంతా ప్యాంట్స్ విప్పేసి తిరిగారు. చిట్టిపొట్టి షార్ట్స్‌తో క్యాంపస్ కలియతిరిగి పండగ చేసుకున్నారు.
 
 ఇదేదో బాగుందే...అని చాలా దేశాల్లో స్టూడెంట్స్ కూడా అట్రాక్ట్ అయిపోయారు. 2000వ సంవత్సరంలో ఆస్టిన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఇది స్టార్ట్ అయ్యింది. తరువాత  కెనడా,స్వీడన్,ఆస్ట్రేలియా,ఫిన్‌లాండ్,యూకే లాంటి దేశాలలో ఈ క్రేజ్ వ్యాపించింది. ఇపుడీ ప్యాంటోపాఖ్యానం ఏమిటనుకుంటున్నారా...? టుడే నో ఫ్యాంట్స్ డే. ప్రతి సంవత్సరం మేలో వచ్చే మొదటి శుక్రవారాన్ని ‘నో ఫ్యాంట్స్ డే’ గా జరుపుకుంటారు.  కెనడా మాజీ ప్రెసిడెంట్ కూడా ఆ రోజున విద్యార్థులతో కలిసి ఫొటోకు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫొటోలోని ఫోజు అదే. శంకర్ తీసిన ‘స్నేహితుడు’ సినిమా చూస్తే ఇండియాలో కూడా ఆ కల్చర్ స్టార్ట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎనీ వే... హ్యాపీ నో ప్యాంట్స్ డే....
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement