షారూఖ్‌కు షాక్! | shock to Shah Rukh | Sakshi
Sakshi News home page

షారూఖ్‌కు షాక్!

Feb 22 2015 4:29 AM | Updated on Apr 3 2019 6:23 PM

షారూఖ్‌కు షాక్! - Sakshi

షారూఖ్‌కు షాక్!

చూస్తుంటే టీవీ భామలకు బాలీవుడ్ స్టార్లంటే లెక్కలేనట్టుంది. ఫరాఖాన్ హోస్ట్ చేస్తున్న టీవీ షో ‘ఫరా కీ దావత్’లో అభిషేక్ బచ్చన్ ....

చూస్తుంటే టీవీ భామలకు బాలీవుడ్ స్టార్లంటే లెక్కలేనట్టుంది. ఫరాఖాన్ హోస్ట్ చేస్తున్న టీవీ షో ‘ఫరా కీ దావత్’లో అభిషేక్ బచ్చన్ ఎపిసోడ్‌కు ఇద్దరు బుల్లితెర నటీమణులు నో చెప్పిన విషయం తెలిసిందే. ఈసారి సర్గుణ్ మెహతా వంతు! ఈ తార ఏకంగా బాలీవుడ్ బాద్‌షాతో కలసి చేసే ఎపిసోడ్‌నే వదిలేసుకుందట! ఈ టీవీ స్టార్‌కు షారూఖ్ అంటే తెగ పిచ్చి.


కానీ... ఇంత మంచి అవకాశం వస్తే ఠక్కున కాదనేసింది. అభిషేక్‌తో ఎపిసోడ్‌కు సదరు భామలు రామని చెప్పిన తరువాత ఫరా... సర్గుణ్‌ను పిలిచింది. దీంతో పాటు షారూఖ్‌తో షోలో కూడా పాల్గొనమని ఆఫర్ ఇచ్చింది. అయితే గియితే కింగ్‌ఖాన్‌తో కలసి సినిమాలో పనిచేస్తాను గానీ... అందరు ఫ్యాన్స్‌లా కలిసే ఆలోచన తనకు లేదని అసలు విషయం చెప్పింది సర్గుణ్! నో చెప్పినందుకు ముందు ఫరా షాక్ తిన్నా... తరువాత సర్గుణ్ మాటలకు కన్విన్స్ అయిందట!
 
 

Advertisement
 
Advertisement
Advertisement