నాట్ ఫర్ ఫ్రెండ్‌షిప్! | Not for Friendship! | Sakshi
Sakshi News home page

నాట్ ఫర్ ఫ్రెండ్‌షిప్!

Dec 13 2014 12:22 AM | Updated on Sep 2 2017 6:04 PM

నాట్ ఫర్ ఫ్రెండ్‌షిప్!

నాట్ ఫర్ ఫ్రెండ్‌షిప్!

మరాఠీ సూపర్‌స్టార్ స్వప్నిల్ జోషీకి బహుశా స్నేహమన్నా... స్నేహితులన్నా గిట్టేటట్టు లేదు. ఓ వెబ్‌సైట్‌తో తన జర్నీ గురించి చెప్పుకొస్తూ... ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.

మరాఠీ సూపర్‌స్టార్ స్వప్నిల్ జోషీకి బహుశా స్నేహమన్నా... స్నేహితులన్నా గిట్టేటట్టు లేదు. ఓ వెబ్‌సైట్‌తో తన జర్నీ గురించి చెప్పుకొస్తూ... ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ఓ కార్పొరేట్ సంస్థతో ఈ హీరో తాజాగా చేసుకున్న ఒప్పందం అతడిని ఫ్రెండ్స్‌కు దూరం చేసేలా ఉంది. దీనిపై ప్రశ్నిస్తే... ‘ఇండస్ట్రీకి వచ్చింది పని చేయడానికి... ఫ్రెండ్‌షిప్ చేసుకోవడానికి కాదు. పని ఉన్నంత కాలం చేస్తూనే పోతా. అది అర్థం చేసుకుని ఉండే వాళ్లే నాతో దోస్తీ కొనసాగిస్తారు. నాకలాంటి మంచి మిత్రులు నలుగురైదుగురున్నారు. వారితో ఎలాంటి ఇబ్బందులూ లేవు. ఒకవేళ ఎవరన్నా నెగటివ్‌గా ఫీలైతే చేయగలిగిందేమీ లేదు. నా జర్నీ మాత్రం ఆగదు’ అంటూ కుండ బద్దలు కొట్టాడు స్వప్నిల్.
 

Advertisement
 
Advertisement
Advertisement