లవ్ బర్డ్స్..! | Love Birds ..! | Sakshi
Sakshi News home page

లవ్ బర్డ్స్..!

Jan 4 2015 12:27 AM | Updated on Sep 2 2017 7:10 PM

లవ్ బర్డ్స్..!

లవ్ బర్డ్స్..!

లేదు లేదంటూనే ఒకరికొకరు అన్నీ అయిపోతున్నట్టున్నారు క్రికెట్ స్టార్ విరాట్ కొహ్లీ- బాలీవుడ్ భామ అనుష్కాశర్మా.

లేదు లేదంటూనే ఒకరికొకరు అన్నీ అయిపోతున్నట్టున్నారు క్రికెట్ స్టార్ విరాట్ కొహ్లీ- బాలీవుడ్ భామ అనుష్కాశర్మా. ఆసీస్ టూర్‌లో ఉన్న విరాట్‌తో క్రిస్మస్, న్యూ ఇయర్ గడిపేందుకు వెళ్లిన అనుష్కా... అక్కడ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఆన్ ఫీల్డ్‌లో విరాట్ నుంచి ఫ్లయింగ్ కిస్‌లు అందుకుంటున్న అమ్మడు... ఆఫ్ ఫీల్డ్‌లోనూ అతగాడిని వదిలిపెట్టకుండా తిరిగేస్తోంది. కొత్త సంవత్సరం రోజు ఈ ఇద్దరూ సిడ్నీలో క్యాజువల్ డ్రెస్సుల్లో షికార్లు కొట్టారట. నెట్‌లో సదరు ‘క్లిక్’లు ‘హిట్టు’ కొడుతున్నాయి. టెస్టు మ్యాచ్ కోసం ప్రస్తుతం మెల్‌బోర్న్‌లో ఉన్న విరాట్‌ను ఎంకరేజ్ చేసేందుకు అనుష్క తన టూర్ కూడా కొనసాగిస్తుందని సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement