హ్యామ్స్ ఫెస్ట్ | Hyam Fest of India 2014 | Sakshi
Sakshi News home page

హ్యామ్స్ ఫెస్ట్

Nov 8 2014 10:38 PM | Updated on Sep 2 2017 4:06 PM

హ్యామ్స్ ఫెస్ట్

హ్యామ్స్ ఫెస్ట్

‘హ్యామ్ ఫెస్ట్ ఇండియా 2014’ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది.

‘హ్యామ్ ఫెస్ట్ ఇండియా 2014’ యువతను విశేషంగా ఆకట్టుకుంటోంది. నాడు సునామీ, నేడు హుదూద్... అల్లకల్లోలమైన విశాఖలో హ్యామ్స్ రేడియో కీలక పాత్ర పోషించింది. సెల్‌ఫోన్లు, ల్యాండ్‌లైన్లు పనిచేయని చోట... పనిచేసిన అమెచ్యూర్ రేడియోలో తామూ భాగస్వాములు కావాలని ఈ ఫెస్ట్‌కు వచ్చిన యువత ఆసక్తి చూపించారు.

బంజారాహిల్స్ ముఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో శనివారం నిర్వహించిన ఈ ప్రదర్శనలో దేశంలోని హ్యామర్లతో పాటు విద్యార్థులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనికేషన్ రంగంలో చోటు చేసుకొంటున్న సాంకేతిక అంశాలపై సెమినార్లు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement