హుమా ఖురేషీ ఔదార్యం | Huma Qureshi magnanimity | Sakshi
Sakshi News home page

హుమా ఖురేషీ ఔదార్యం

Dec 1 2014 11:45 PM | Updated on Sep 2 2017 5:28 PM

హుమా ఖురేషీ ఔదార్యం

హుమా ఖురేషీ ఔదార్యం

సినీ ప్రముఖులంతా ‘స్వచ్ఛభారత్’హోరులో చీపురుకట్టలు చేతపట్టి చెత్తే కనిపించని వీధులను తుడుస్తూ ఫొటోలకు పోజులిస్తుంటే

సినీ ప్రముఖులంతా ‘స్వచ్ఛభారత్’హోరులో చీపురుకట్టలు చేతపట్టి చెత్తే కనిపించని వీధులను తుడుస్తూ ఫొటోలకు పోజులిస్తుంటే, హుమా ఖురేషీ మాత్రం ఎలాంటి ప్రచారం లేకుండా ఢిల్లీలోని నిరుపేదల పట్ల తన ఔదార్యాన్ని చాటుకుంటోంది. ఢిల్లీలో నిలువ నీడలేని నిరుపేదలు చాలామంది అక్కడి చలి తీవ్రతకు ఏటా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ పరిస్థితిని నివారించేందుకు హుమా ఖురేషీ, ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఢిల్లీలోని పేదలకు దుప్పట్లు పంపిణీ చేస్తోందట.

Advertisement
 
Advertisement
Advertisement