మా ఇంటికొస్తే.. ఏం తీసుకుంటారు | Gift-Giving and Receiving develop courtesy between relationship | Sakshi
Sakshi News home page

మా ఇంటికొస్తే.. ఏం తీసుకుంటారు

Jul 19 2014 3:26 AM | Updated on Sep 2 2017 10:29 AM

మా ఇంటికొస్తే.. ఏం తీసుకుంటారు

మా ఇంటికొస్తే.. ఏం తీసుకుంటారు

నమస్కారానికి ప్రతినమస్కారం మన సంస్కారం బహుమతికి ప్రతిబహుమతి మన సంప్రదాయం కానుకగా ఖరీదైన వస్తువు ఇవ్వాల్సిన పనిలేదు..

నమస్కారానికి ప్రతినమస్కారం మన సంస్కారం బహుమతికి ప్రతిబహుమతి మన సంప్రదాయం కానుకగా ఖరీదైన వస్తువు ఇవ్వాల్సిన పనిలేదు.. డాబు, దర్పం ప్రదర్శించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఇంటి వేడుకలో ఆనందాన్ని పంచుకున్న అతిథికి రిటర్న్ గిఫ్ట్ జ్ఞాపికగా మిగిలిపోవాలి. మనం అందించే ప్రతిబహుమతి.. ఆ వేడుకకు ప్రతిరూపం కావాలి. ఆ సందర్భానికి తగ్గట్టు ఉండాలి.
 
 మనసారా ఆశీర్వదించడానికి మనింటికి వచ్చిన వారికి మధుర జ్ఞాపకాన్ని అందించడానికి ఎంతో ఆలోచిస్తాం.  ఎన్నో షాపులు తిరుగుతాం. అయినా, మది దోచే బహుమతి ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడా బాధలేదు. మన శుభకార్యాన్ని ప్రతిబింబించేలా.. మన అతిథులకు కలకాలం గుర్తుండేలా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేశాయి. ఇలాంటి బహుమతులను మీరూ అందించాలంటే  ఫిల్మ్‌నగర్‌లోని ‘ది రిటర్‌‌న గిఫ్ట్ షాప్’కు వెళ్లాల్సిందే.
 
 సమ్‌థింగ్ స్పెషల్
 పేరుకు తగ్గట్టే ‘ది రిటర్‌‌న గిఫ్ట్ షాప్’ లో గిఫ్ట్‌లు కూడా అంతే వెరైటీగా ఉంటాయి. మామూలు గిఫ్ట్ షాపుల్లో బహుమతులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ సందోర్భోచిత కానుకలు కనిపిస్తాయి. కార్పొరేట్ ఈవెంట్ నుంచి కాలేజ్ ప్రోగ్రామ్స్ వరకు.. బారసాల నుంచి వివాహాది శుభకార్యాల వరకు ఈవెంట్‌కు తగ్గ గిఫ్ట్‌లు లభిస్తాయి. గిఫ్ట్‌లే కాదు.. వాటిని పెట్టి ఇచ్చే బ్యాగులు కూడా అలాగే లభిస్తాయి. కస్టమైజ్డ్ పేపర్ బ్యాగులతో నగరంలో నయాట్రెండ్ సృష్టించిన ‘ది పేపర్ బ్యాగ్ షాప్’ సంస్థ నిర్వాహకులు వంశీ మోహన్ కోకా, వసంత చిగురుపాటి దంపతుల ఆలోచనల ప్రతిరూపమే ఈ ‘ది రిటర్‌‌న గిఫ్ట్ షాప్’.
 
 సందర్భానికి తగ్గట్టు.. సరసమైన ధరల్లో
 ఈవెంట్‌కు తగిన రిటర్న్ గిఫ్ట్ అంటే రేట్ ఎక్కువనుకోకండి. ధర తక్కువే కాదు.. బల్క్‌లో కూడా ఇక్కడ గిఫ్ట్‌లను ఎంపికచేసుకోవచ్చు. మనకు నచ్చే రీతిలో గిఫ్ట్ బ్యాగులను కూడా ఇక్కడ తయారు చేయించుకోవచ్చు. గిఫ్ట్‌లు ఆర్డర్ ఇస్తే వారం రోజుల్లో దేశంలో ఎక్కడైనా డోర్ డెలివరీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అదే లోకల్‌గా అయితే ఒక్కరోజులో గిఫ్ట్స్ మీ ఇంటి ముందుంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కొరియర్ కంపెనీలతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇక ఆన్‌లైన్‌లో గిఫ్ట్‌లు ఆర్డర్ చేయాలనుకునేవారి కోసం త్వరలో www.thereturngiftshop.com అనే వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
 అడ్రస్ ది రిటర్స్ గిఫ్ట్ షాప్
 ఇంటి నంబర్: 45, ప్లాట్  నంబర్: 407
 రోడ్ నంబర్ 81, ఫిల్మ్ నగర్
 ఫోన్ : 9676693340.
 www.facebook.com/
 TheReturnGiftShop

Advertisement
 
Advertisement
Advertisement