breaking news
Gift shop
-
ఆకట్టుకునే దృశ్యం: ‘ఎంత ముచ్చటగా ఉన్నాయో’
వాషింగ్టన్: ఆకట్టుకునే దృశ్యం. అది పెంగ్విన్స్ బహుమతుల దుకాణం. అందులో అన్ని పెంగ్విన్ బొమ్మలే. వాటిని చూసి ఇద్దరు అనుకొని కస్టమర్లు ఆ షాపులోకి వచ్చారు. ఎంతో ఆసక్తితో షాపంతా తిరగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకి ఆ అనుకొని కస్టమర్లు ఎవరంటే రెండు పెంగ్విన్లు. అవి అలా ఆ దుకాణంలోకి వచ్చి షాపు మొత్తం ఉత్సాహంగా తిరుగుతున్న ఈ వీడియోకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను అమెరికా షెడ్ అక్వేరియం వారు గురువారం ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి: ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే.) The penguins explore the gift shop! 🐧 Penguins Izzy and Carmen took a field trip to Shedd's gift shop and found...even more penguins. pic.twitter.com/6lEFLUMpyF — Shedd Aquarium (@shedd_aquarium) August 3, 2020 37 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ‘అవును పెంగ్విన్లు కూడా షాపింగ్ చేస్తాయి. ఈ దుకాణంలో ఓ బహుమతి వాటిని ఆకట్టుకుంది కూడా’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు. ఆ రెండు పెంగ్విన్లు తమకు నచ్చిన బహుమతిని ఎంచుకున్న ఈ దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 42వేల వ్యూస్.. వందల్లో కామెంట్స్ వచ్చాయి. వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘ప్రపంచలోనే అత్యంత అందమైన జంతువుల్లో పెంగ్విన్లు ఒకటి. అవి అలా షాపంతా తిరుగుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది’, ‘వాటిని చూస్తుంటే ముచ్చటేస్తోంది’, హ్యాపీ షాపింగ్ పెంగ్విన్స్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: వైరల్ : ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు) -
జగిత్యాలలో భారీ అగ్ని ప్రమాదం
-
జగిత్యాలలో భారీ అగ్ని ప్రమాదం
జగిత్యాల: కరీంనగర్ జిల్లా జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ వద్ద ఓ షాపులో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏబీ వరల్డ్ పేరుతో ఉన్న గిఫ్ట్ షాపులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రూ. 5 లక్షల మేర ఆస్టి నష్టం జరిగినట్టు సమాచారం. ఈ షాపును నెల రోజుల క్రితమే ప్రారంభించారు. -
మా ఇంటికొస్తే.. ఏం తీసుకుంటారు
నమస్కారానికి ప్రతినమస్కారం మన సంస్కారం బహుమతికి ప్రతిబహుమతి మన సంప్రదాయం కానుకగా ఖరీదైన వస్తువు ఇవ్వాల్సిన పనిలేదు.. డాబు, దర్పం ప్రదర్శించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఇంటి వేడుకలో ఆనందాన్ని పంచుకున్న అతిథికి రిటర్న్ గిఫ్ట్ జ్ఞాపికగా మిగిలిపోవాలి. మనం అందించే ప్రతిబహుమతి.. ఆ వేడుకకు ప్రతిరూపం కావాలి. ఆ సందర్భానికి తగ్గట్టు ఉండాలి. మనసారా ఆశీర్వదించడానికి మనింటికి వచ్చిన వారికి మధుర జ్ఞాపకాన్ని అందించడానికి ఎంతో ఆలోచిస్తాం. ఎన్నో షాపులు తిరుగుతాం. అయినా, మది దోచే బహుమతి ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడా బాధలేదు. మన శుభకార్యాన్ని ప్రతిబింబించేలా.. మన అతిథులకు కలకాలం గుర్తుండేలా రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేశాయి. ఇలాంటి బహుమతులను మీరూ అందించాలంటే ఫిల్మ్‌నగర్‌లోని ‘ది రిటర్న గిఫ్ట్ షాప్’కు వెళ్లాల్సిందే. సమ్‌థింగ్ స్పెషల్ పేరుకు తగ్గట్టే ‘ది రిటర్న గిఫ్ట్ షాప్’ లో గిఫ్ట్‌లు కూడా అంతే వెరైటీగా ఉంటాయి. మామూలు గిఫ్ట్ షాపుల్లో బహుమతులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ సందోర్భోచిత కానుకలు కనిపిస్తాయి. కార్పొరేట్ ఈవెంట్ నుంచి కాలేజ్ ప్రోగ్రామ్స్ వరకు.. బారసాల నుంచి వివాహాది శుభకార్యాల వరకు ఈవెంట్‌కు తగ్గ గిఫ్ట్‌లు లభిస్తాయి. గిఫ్ట్‌లే కాదు.. వాటిని పెట్టి ఇచ్చే బ్యాగులు కూడా అలాగే లభిస్తాయి. కస్టమైజ్డ్ పేపర్ బ్యాగులతో నగరంలో నయాట్రెండ్ సృష్టించిన ‘ది పేపర్ బ్యాగ్ షాప్’ సంస్థ నిర్వాహకులు వంశీ మోహన్ కోకా, వసంత చిగురుపాటి దంపతుల ఆలోచనల ప్రతిరూపమే ఈ ‘ది రిటర్న గిఫ్ట్ షాప్’. సందర్భానికి తగ్గట్టు.. సరసమైన ధరల్లో ఈవెంట్‌కు తగిన రిటర్న్ గిఫ్ట్ అంటే రేట్ ఎక్కువనుకోకండి. ధర తక్కువే కాదు.. బల్క్‌లో కూడా ఇక్కడ గిఫ్ట్‌లను ఎంపికచేసుకోవచ్చు. మనకు నచ్చే రీతిలో గిఫ్ట్ బ్యాగులను కూడా ఇక్కడ తయారు చేయించుకోవచ్చు. గిఫ్ట్‌లు ఆర్డర్ ఇస్తే వారం రోజుల్లో దేశంలో ఎక్కడైనా డోర్ డెలివరీ చేసే అవకాశం కల్పిస్తున్నారు. అదే లోకల్‌గా అయితే ఒక్కరోజులో గిఫ్ట్స్ మీ ఇంటి ముందుంటాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కొరియర్ కంపెనీలతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇక ఆన్లైన్లో గిఫ్ట్‌లు ఆర్డర్ చేయాలనుకునేవారి కోసం త్వరలో www.thereturngiftshop.com అనే వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. అడ్రస్ ది రిటర్స్ గిఫ్ట్ షాప్ ఇంటి నంబర్: 45, ప్లాట్ నంబర్: 407 రోడ్ నంబర్ 81, ఫిల్మ్ నగర్ ఫోన్ : 9676693340. www.facebook.com/ TheReturnGiftShop