బెడ్ రెస్ట్! | Bed Rest | Sakshi
Sakshi News home page

బెడ్ రెస్ట్!

Apr 4 2015 11:43 PM | Updated on Apr 3 2019 6:23 PM

బెడ్ రెస్ట్! - Sakshi

బెడ్ రెస్ట్!

బాలీవుడ్ హీరోగా కంటే... దీపికా పడుకొనే బాయ్‌ఫ్రెండ్‌గానే బాగా పాపులర్ అయిన రణవీర్‌సింగ్ మంచాన పడ్డాడు.

బాలీవుడ్ హీరోగా కంటే... దీపికా పడుకొనే బాయ్‌ఫ్రెండ్‌గానే బాగా పాపులర్ అయిన రణవీర్‌సింగ్ మంచాన పడ్డాడు. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ జారి కిందపడటంతో కుడి చేతికి గాయమైంది. ముంబైలోని ఓ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న రణవీర్... ఆపరేషన్ థియేటర్ నుంచే ఓ సెల్ఫీ దిగి... అభిమానుల కోసం దాన్ని ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశాడు.

నెల కిందటే జారి పడినా... రెగ్యులర్ ఫిజియోథెరపీ సరిపోతుందని మొదట భావించాడట. అయితే దాని వల్ల ఫలితం లేకపోవడంతో... చివరకు శస్త్రచికిత్సకు వెళ్లాల్సి వచ్చిందని సమాచారం. మూడు వారాల బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు చెప్పారు. ఆ తరువాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నా యాక్షన్ సీన్లకు దూరంగా ఉండాలని సూచించారట. 

Advertisement
 
Advertisement
Advertisement