రాష్ట్ర విభజన సమయంలో తలెత్తే అంశాలను పరిశీలించి, వాటికి పరిష్కారం మార్గాలను సూచించడానికే ఆంటోని కమిటీ పనని తేలిపోయింది. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ నిన్న స్సష్టం చేసింది. విభజన నిర్ణయం జరిగిపోయిందని, అభిప్రాయాలు తెలుసుకొని విధివిధానాలు రూపొందిచడమే తరువాయని అధిష్టానం నేతలందరూ ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. సాధ్యమైనంత తొందరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయినా తమ ఆందోళనతో ఈ కమిటీ ఏర్పడిందని, అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లభించిందని, సిడబ్ల్యూసి నిర్ణయం వెనుకకు తీసుకునే అవకాశం ఉందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. కమిటీ తమ పరిధిని స్పష్టం చేయడతో అసలు విషయం అందరికీ అర్ధమైపోయింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు యుపిఏ ప్రభుత్వం జూలై 31న కేంద్రం ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేకుంటా అసలు విభజించవద్దని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేశారు. మరో పక్క ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ఉరికారు. బంద్‌లు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలిచాయి. అప్పటి వరకు నోరుమెదకుండా ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులకు గొంతు విప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో ఓ కమిటీని నియమించారు. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అప్పుడే స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ కమిటీ వల్ల మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రజలకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది.
మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణదీక్షలు ప్రారంభించారు. వారి దీక్షలకు సమైక్యాంధ్ర ప్రజలు అపూర్వమైన రీతిలో సంఘీభావం తెలుపుతున్నారు. కాంగ్రెస్,టిడిపి ప్రజాప్రనిధులు కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విభజనకు అంగీకారం తెలిపారు. రాజధానికి ఏర్పాటుకు నిధులు కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రనిధులను మాత్రం ప్రజలు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేయడం మొదలు పెట్టారు. ఇంకోపక్క చంద్ర బాబు బస్సు యాత్ర అంటున్నారు. కాంగ్రెస్ వారైతే ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు. అధిష్టానం నేతలను, ఆంటోనీ కమిటీని కలుస్తున్నారు. రెండవ ఎస్ఆర్సి - హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం - హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - రాయల తెలంగాణ - నదీజలాలు....ఇలా వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. కానీ వారి మాటలు వినేనాధుడు కనిపిచడంలేదు.
ఆంటోనీ కమిటీ ఒక పక్క ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటే, మరో పక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి తోడు తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని, కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కూడా చెప్పారు. ఇప్పుడు వారు నిర్ణయం మార్చుకుంటే తామేమీ చేయాలని ఆయన ప్రశ్నించారు. వీరి మాటలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంటోనీ కమిటీ విభజన ప్రక్రియను సులభతరం చేయడానికి నియమించినదిగా అర్ధమవుతోంది.
అది విభజన కమిటీయే!
Published Wed, Aug 21 2013 2:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రూపురేఖలు మారాయి
అగ్రి ల్యాబ్ ఎంతో ప్రయోజనం
● ప్రగతి పథంలో దూసుకుపోతున్న గ్రామాలు ● పరుగులు పెడుతున్న అభివృద్ధి పనులు ● వెల్లివిరుస్తున్న ప్రభుత్వ భవనాలు ● నాడు–నేడుతో సమూలంగా మారిన సర్కారు బడులు ● ఇళ్లు కాదు.. ఊళ్లుగా వెలిసిన జగనన్న కాలనీలు ● అబ్బో..! ఎటు చూసినా నయా మెరుగులే!
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
రేపు, ఎల్లుండి కూడా పోస్టల్ బ్యాలెట్
రోబోటిక్ టెక్నాలజీతో మోకాలి మార్పిడి శస్త్రచికిత్స
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ
అబ్బో.. ఆ యువ నాయకుడితో ఎట్టా ఏగేది?
బూటకాల ‘బాబు’
వైఎస్సార్సీపీ జోష్
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement