ఈ వారం యుట్యూబ్ హిట్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యుట్యూబ్ హిట్‌

Feb 5 2017 10:34 PM | Updated on Apr 4 2019 3:20 PM

ఈ వారం యుట్యూబ్  హిట్‌ - Sakshi

ఈ వారం యుట్యూబ్ హిట్‌

మారియా ప్రామిస్‌ నిలబెట్టుకున్నారు. చెప్పినట్టే తన కొత్త సింగిల్‌ ట్రాక్‌ ‘ఐ డోన్ట్‌’ను వైజితో కలిసి రిలీజ్‌ చేశారు.

మారియా కేరీ: ఫీచరింగ్‌ వైజి
నిడివి : 4 ని. 16 సె., హిట్స్‌ : 30,87,100


మారియా ప్రామిస్‌ నిలబెట్టుకున్నారు. చెప్పినట్టే తన కొత్త సింగిల్‌ ట్రాక్‌ ‘ఐ డోన్ట్‌’ను వైజితో కలిసి రిలీజ్‌ చేశారు. వైజి 26 ఏళ్ల అమెరికన్‌ హిప్‌ హాప్‌ రికార్డింగ్‌ ఆర్టిస్ట్‌. ఇక మారియా!  ‘విజన్‌ ఆఫ్‌ లవ్‌’తో ఫేమ్‌లోకి వచ్చిన అమెరికన్‌ సింగర్, సాంగ్‌ రైటర్, నటి.  ఆ కుర్రాడు, ఈ 47 ఏళ్ల ప్రౌఢ కలిసి తాజాగా ‘ఐ డోన్ట్‌’ను వీనులలోకి, వినువీధులలోకి వదిలారు. ‘ఐ డోన్ట్‌’ అనేది బ్రేకప్‌ సాంగ్‌. ఒకప్పటి తన బాయ్‌ఫ్రెండ్‌ జేమ్స్‌ ప్యాకర్‌కు ఒక ప్రేమానంతర సందేశంలా ఈ గీతాన్ని ఆలపించారు మారియా. పాట వైజీతో స్టార్‌ అవుతుంది. ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. కానీ నన్ను నమ్మవు. నన్ను అర్థం చేసుకోవు’ అంటాడు వైజీ. తర్వాత చరణాలన్నీ మారియా కేరీవి. మొదటి చరణం ఒక్కటి చాలు ప్రేమలో అబ్బాయిల కారణంగా అమ్మాయిలు ఎంత ఆవేదనకు గురవుతారో! మారియా అంటుంది.. ‘వేరే జన్మల్లో ఎక్కడి నుంచో మన కోసం కొన్ని క్షణాలను దొంగిలించుకు వచ్చాం.

నీకు కావలసినదంతా ఇచ్చాను. మళ్లీ మళ్లీ ఇవ్వడానికి వచ్చాను. నువ్వెప్పటికీ నా వాడివే అని చెప్పావు! కానీ వట్టి అబద్ధాలను తప్ప నువ్వు నాకేమీ ఇవ్వలేదు. ఏడ్చి ఏడ్చి అలసిపోయాను. కన్నీళ్లేం మిగల్లేదు’ అని మారియా పాడుతుంటే మన హృదయమూ మూగబోతుంది. చివరి చరణంలో మారియా ఒక సందేశం కూడా ఇస్తుంది. ‘నువ్వొకర్ని ప్రేమించినంత మాత్రాన వారిని తక్కువగా చూడకు’ అంటుంది. కరెక్ట్‌గా రైట్‌ టైమ్‌లో రిలీజ్‌ అయిన వీడియో సాంగ్‌ ఇది. వాలెంటైన్స్‌ డే వస్తోంది కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement