స్మాల్ స్క్రీన్కు బిగ్ స్క్రీన్కు పెళ్లంట | Yes, Bipasha Basu is Marrying Karan Singh Grover Next Month | Sakshi
Sakshi News home page

స్మాల్ స్క్రీన్కు బిగ్ స్క్రీన్కు పెళ్లంట

Mar 31 2016 11:33 PM | Updated on Sep 3 2017 8:57 PM

స్మాల్ స్క్రీన్కు బిగ్ స్క్రీన్కు పెళ్లంట

స్మాల్ స్క్రీన్కు బిగ్ స్క్రీన్కు పెళ్లంట

బాలీవుడ్‌కు ఇది బ్రేకప్ నామ సంవత్సరంగా చెప్పొచ్చు. రణబీర్ కపూర్ నుంచి కత్రినా కైఫ్, విరాట్ కోహ్లీకి అనుష్కా శర్మ దూరమై, వార్తల్లో నిలిచారు.

బాలీవుడ్‌కు ఇది బ్రేకప్ నామ సంవత్సరంగా చెప్పొచ్చు. రణబీర్ కపూర్ నుంచి కత్రినా కైఫ్, విరాట్ కోహ్లీకి అనుష్కా శర్మ దూరమై, వార్తల్లో నిలిచారు. అర్భాజ్ ఖాన్, మలైకా అరోరా కూడా తమ వివాహ బంధానికి స్వస్తి పలికారు. విడిపోయాం కానీ, విడాకులు తీసుకోలేదని ఇద్దరూ పేర్కొన్నారు. ఈ బ్రేకప్ లిస్ట్‌లో ప్రేమపక్షులు కరణ్‌సింగ్ గ్రోవర్-బిపాసా బసులు కూడా ఉంటారని చాలా మంది భావించారు. గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్న ఈ ఇద్దరి లవ్ లైఫ్‌లో కూడా ఏవో చిన్నపాటి మనస్పర్థలు నెలకొన్నాయనే వార్తలు వచ్చాయి.

బుల్లితెర నటి జెన్నిఫర్ వింగెట్‌తో వివాహబంధాన్ని తెంచుకున్న కరణ్ మళ్లీ పెళ్లి చేసుకోవడం, అది కూడా బిపాసా బసును పెళ్లాడటం అతని తల్లికి ఇష్టం లేదని టాక్. ఒకవేళ బిప్స్‌ని పెళ్లి చేసుకుంటే ఇంట్లోకి కూడా రానివ్వనని చెప్పారట కూడా. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి పెళ్లి కష్టమేనని చాలా మంది అనుకున్నారు. అయితే అందరినీ ఆశ్చర్యపరిచేలా కరణ్ గ్రోవర్- బిప్స్ తమ పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారని సమాచారం. కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల  సమక్షంలో బెంగాలీ స్టయిల్లో వచ్చే నెల 29న వీళ్లిద్దరి పెళ్లి జరగనుందట. ముంబైలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఈ పెళ్లి జరగనుందని భోగట్టా. రిసెప్షన్‌కు మాత్రం సినిమా రంగానికి చెందినవారిని ఆహ్వానించారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement