వెన్‌ హ్యారీ మెట్‌ మార్కెల్‌ | 'When Harry Met Sally' As Inspiring Cinema | Sakshi
Sakshi News home page

వెన్‌ హ్యారీ మెట్‌ మార్కెల్‌

Nov 30 2017 11:20 PM | Updated on Dec 1 2017 4:04 AM

'When Harry Met Sally' As Inspiring Cinema - Sakshi

‘వెన్‌ హ్యారీ మెట్‌ శాలీ’ అన్న హాలీవుడ్‌ సినిమా వంద రకాలుగా, వంద భాషల్లో వందసార్లు వచ్చి ఉంటుంది. అంత ఇన్‌స్పైరింగ్‌ సినిమా. ఇంకో సినిమా కూడా వచ్చింది. ‘మెయిడ్‌ ఇన్‌ మాన్‌హట్టన్‌’. ఓ పెద్దింటి కుర్రాడికి ఓ పనమ్మాయికి మధ్యలో ప్రేమ. ఇంకో సినిమా కూడా వచ్చింది. ‘ప్రెట్టీ ఉమన్‌’. ఒక విటురాలికి, ఓ సూపర్‌ రిచ్‌ మ్యాన్‌కీ లవ్వు. చూశారా! ఈ అన్నీ సినిమాల్లోనూ గొప్పింటోడు పేదింటమ్మాయిని చేసుకున్నాడు కాబట్టి ఆ అమ్మాయికేదో ఇంత ఐడెంటిటీ ఏడ్చింది. ఇక్కడే ప్రియాంకా చోప్రాకు కోపం వచ్చింది. తన స్నేహితురాలు మేఘనా మార్కెల్‌ ఒక మంచి యాక్టర్, సమాజ సేవకురాలు, యాక్టివిస్టు, పరోపకారి, అందగత్తె, అన్ని ఉండగా ప్రిన్స్‌ హ్యారీకి కాబోయే భార్యగా మాత్రమే మీడియా అంతా టముకు టమూ, టముకు టమూ అని టముకు కొట్టేస్తుంటే చిర్రెత్తదు మరీ. ప్రియాంకకు మార్కెల్‌ మంచి స్నేహితురాలు.

త్వరలో ప్రిన్స్‌ హ్యారీతో పెళ్లి. ఇక ఇప్పుడు బ్రిటిష్‌ మీడియా అంతా.. ప్రియాంకా చోప్రాయే మార్కెల్‌కు ఫేవరెట్‌ అండ్‌ ఫస్ట్‌ బ్రైడ్స్‌మేడ్‌ (పెళ్లికూతురుకు సహాయకురాలు) అని టముకు మొదలుపెట్టింది. నిన్నటి దాకా మార్కెల్‌.. ప్రిన్స్‌ హ్యారీ లవర్‌గా గుర్తింపు తెచ్చుకుంటే ఇప్పుడు ప్రియాంక ఆవిడ బ్రైడ్స్‌మేడ్‌గా సూపర్‌ ప్రమోషన్‌ కొట్టేస్తోంది. ఏమైనా చెప్పండి. బాలీవుడ్‌ అమ్మాయిలు చాలా స్మార్ట్‌. ఎప్పుడూ ఎలాగైతేనేం అలా న్యూస్‌లో ఉంటారు. ఒక అమ్మాయికి, ఓ రాకుమారుడి కాబోయే భార్యగా కాకుండా వ్యక్తిత్వం ఉన్న మనిషిగా గుర్తింపు ఇవ్వాలి అని స్టేట్‌మెంట్‌ ఇచ్చి ప్రియాంక చోప్రా మంచి గుర్తింపు కొట్టేసింది.

Advertisement
 
Advertisement
Advertisement