విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రతరం! | Vitamin D is "exacerbated by the lack of prostate cancer! | Sakshi
Sakshi News home page

విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రతరం!

Mar 27 2016 11:06 PM | Updated on Sep 3 2017 8:41 PM

విటమిన్ ‘డి’ లోపం వల్ల   ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రతరం!

విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ తీవ్రతరం!

విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ మరింత తీవ్రతరం అవుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

మెడి క్షనరీ


విటమిన్ ‘డి’ లోపం వల్ల ప్రొస్టేట్ క్యాన్సర్ మరింత తీవ్రతరం అవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. ‘జర్నల్ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీ’ అనే మెడికల్ జర్నల్‌లో ఈ విషయం ప్రచురితమైంది. ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చి ‘రాడికల్ ప్రొస్టెటెక్టమీ’ అనే శస్త్రచికిత్స చేయించుకున్న 190 మంది పురుషులను ఈ అధ్యయనం కోసం ఎంచుకున్నారు. వీళ్లందరి సగటు వయసు 64 ఏళ్లు. వారిలో దాదాపు సగం మందికి ప్రొస్టేట్ క్యాన్సర్ మరింత తీవ్రతరమైందని గుర్తించారు.

వాళ్లందరికీ రెండు నెలల ముందు ఓసారి, రెండు నెలల తర్వాత మరోసారి విటమిన్ -డి పాళ్లు పరీక్షించారు. ఈ అధ్యయనం ద్వారా తేలిన సంగతేమిటంటే ప్రొస్టేట్ క్యాన్సర్ తీవ్రతరమైన వారందరిలోనూ విటమిన్-డి పాళ్లు చాలా తక్కువని తేలింది. దాంతో విటమిన్-డి తగ్గడం ప్రొస్టేట్ క్యాన్సర్‌ను మరింత ప్రేరేపిస్తుందని తెలిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement