విజయవాడ పుస్తక ప్రదర్శన... | Vijayawada Book Fair | Sakshi
Sakshi News home page

విజయవాడ పుస్తక ప్రదర్శన...

Jan 3 2015 12:06 AM | Updated on Sep 2 2017 7:07 PM

విజయవాడ పుస్తక ప్రదర్శన...

విజయవాడ పుస్తక ప్రదర్శన...

పుస్తకాలు ఏమిస్తాయి? వెలుతురునిస్తాయి. వెలుతురులో ఏకాంతపు మసకనిస్తాయి.

పుస్తకాలు ఏమిస్తాయి? వెలుతురునిస్తాయి. వెలుతురులో ఏకాంతపు మసకనిస్తాయి. మెలకువనిస్తాయి. మెలకువ కలిగించే విసుగుపాటులో హాయిగొలిపే లోకాల నిద్రనిస్తాయి. బుద్ధినిస్తాయి. బుద్ధి వల్ల కలిగే తర్కపు నిరంకుశత్వాన్ని దాటివెళ్లమనే హృదయాన్నిస్తాయి. ఆలోచన ఇస్తాయి. ఆలోచన వల్ల కలిగే చైతన్యపు అస్తిమిత్వాన్నుంచి సేద దీర్చే విహారాన్నిస్తాయి. పుస్తకాలు ఏమిస్తాయి? మనిషికి అవసరమైన కొత్త రక్తాన్ని ఇస్తాయి.

నిత్య స్పందనలిస్తాయి. క్లేశాల నుంచి, శ్లేష్మాల నుంచి, సంకుచితాల మలినాల నుంచి, వ్యక్తిత్వలేమి వల్ల కలిగే రుగ్మతల నుంచి స్వేచ్ఛను ప్రసాదిస్తాయి. కుటుంబం అంటే తల్లి, తండ్రి, పిల్లలు వాటితో పాటు మంచి పుస్తకం కూడా. విజయవాడ పి.డబ్యు.డి గ్రౌండ్స్‌లో పుస్తక ప్రదర్శన జరుగుతోంది. జనవరి 11 వరకూ దాదాపు 390 స్టాల్స్ పుస్తకాల రాశిపోయనున్నాయి. చేయందుకోండి. చేయి వదలని ఆ స్నేహితుడిని గట్టిగా పట్టుకోండి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement